లోన్ EMI చెల్లించలేని వారికి RBI అద్దిరేపోయే గుడ్ న్యూస్, ఆ శుభవార్త ఏంటో తెలుసా..?
సమయానికి అవసరమైన లోన్ ను తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటాం. కొన్నినెలలు క్రమంగా లోన్ చెల్లించినా.. మధ్యలో వచ్చే ఇబ్బందుల కారణంగా.. లోన్ ఈఎంఐకట్టలేకపోతుంటారు కొందరు. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్లు లోన్ ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే జైలుకు వెళ్తారని బెదిరిస్తుంటారు. అయితే RBI ప్రజలకు ఇలాంటి పరిస్థితుల విషయంలో సహాయం చేయడానికి మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది.
EMI సరిగ్గా కట్టకపోతే పోలీస్ కేస్ పెట్టి జైల్లో వేయిస్తామని లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తూ ఉంటారు. అయితే EMI కట్టకపోవడం అనేది అసలు క్రిమినల్ నేరం కాదని తేల్చి చెప్పేసింది RBI. మీరు లోన్‌ను డిఫాల్ట్ చేసినందుకు ఎటువంటి జైలు శిక్షను ఎదుర్కోరు. లోన్ చెల్లింపులకు లింక్ చేసిన బౌన్స్ చెక్ చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు, కానీ కేవలం EMIని కట్టకపోవడం మాత్రం మిమ్మల్ని జైలు పాలు చేయదు.అయితే EMI చెల్లింపులు చేయకపోవడం వల్ల క్రిమినల్ కేసులు ఉండవు.
కానీ ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఫ్యూచర్ లో మీకు ఏ బ్యాంక్ నుంచి లోన్లు రావు. ఒకవేళ లోన్లు వచ్చినా కూడా మీరు ఎక్కువ వడ్డీని కట్టాల్సి ఉంటుంది. మీరు EMI కట్టలేక పోతే బ్యాంకులు మీ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. వాటిని వేలం వేయవచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు బ్యాంక్ ని సంప్రదించక పోతే జరుగుతుంది. మీరు లోన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నప్పుడు కచ్చితంగా బ్యాంక్ కి వెళ్ళాలి. మీ సమస్యని వారికి చెప్పాలి. మీ లోన్ తీర్చడానికి పరిష్కారం అడగాలి. అప్పుడు బ్యాంక్ మీకు పరిష్కారం చూపిస్తుంది.
మీ టెన్యూర్ పెంచడమో లేక వడ్డీని తగ్గించడమో లేదా మీకు అప్పు తీర్చుకోడానికి కొంత టైమ్ ఇవ్వడమో చేస్తుంది. దాంతో మీకు లోన్ తీర్చుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి EMI కట్టలేక పోవడం అనేది క్రిమినల్ నేరం కాదు. ఈ రూల్ బ్యాంకులకే కాదు ఇతర ఫైనాన్స్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. మీకు EMI కట్టడం ఇబ్బంది అయితే RBI రూల్స్ ప్రకారం మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకోవడం మంచిది. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.