పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా..? అది పెద్ద ప్రమాదానికి సంకేతం అని తెలుసా..?
ఏదో ఒకటి చెప్పి ఎక్కిళ్లు తగ్గిపోయేలా చేయటం చూస్తూనే ఉంటాం. ఒకటీ రెండు నిమిషాల పాటు వచ్చి పోయే ఎక్కిళ్లు అయితే ఏ ప్రాబ్లం లేదు. కానీ, ఒక్కోసారి విడవకుండా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చక్కెర తిన్నా, మంచి నీళ్లు తాగినా తగ్గకుండా ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. అయితే మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంది.
లేకపోతే ప్రాణాలకే ముప్పు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలని అంటున్నారు వైద్య నిపుణులు. బ్రెయిన్ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలు..అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలా మంది తలవెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుందట.. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ అని గుర్తించాలంటున్నారు. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం..10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని అధ్యయనంలో గుర్తించారు.
అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్‌పై యూకేలో 1300 మందిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు తేలాయి. అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలి. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్ ఫుడ్స్ తినే అలవాటు ఉన్నా వాటితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాలు తీసుకోవాలి.