News

రేణుకా స్వామిని అంత దారుణంగా చంపారా..? పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది..?

ఇప్పటికే ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించడంతో.. పోలీసులు పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న దర్శన్, పవిత్ర గౌడ, పవిత్ర పని మనిషి పవన్, చిత్రదుర్గ దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రతో పాటు సుమారు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ తో పాటు పవిత్రగౌడను పోలీసులు విచారించారు. అయితే బెంగుళూరు చిత్ర దుర్గకు చెందిన రేణుకాస్వామి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

తాను ఎంతో అభిమానించే చాలెంజింగ్ హీరో దర్శన్ తుగదీప్ ఈ హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ హత్య కేసులో కీలక పాత్ర పోషించిన దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మంది నిందితులను జ్యుడిషయిల్ కస్టడీలోకి తీసుకున్నారు. దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. మిగిలిన నిందితులు తుమకూరు జైలుకు తరలించారు. అయితే రేణుకాహత్య ఎలా జరిగింది? హత్యకు ముందు పట్టంగారే షడ్ లో ఏం జరిగిందనేది పోలీసు విచారణలో తేలిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

హత్యకు ముందు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రేణుకాస్వామికి బాగా తినిపించారు. ఈ తర్వాత అతన్ని కొట్టి చిత్ర హింసలు పెట్టి హత్య చేసినట్లు తెలుస్తుంది. హత్యకు గురైన రేణుకాస్వామి కడుపులో జీర్ణం కాని ఆహారం ఉందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులపై పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు.పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్టు త్వరలోనే చార్జిషీట్ ను సమర్పించనున్నట్లు తెలిపారు. కాగా, రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ ఉండగా.. ఏ2 దర్శన్, పవన్ ఏ3 నిందితులు గా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker