హీరోయిన్ మహేశ్వరిని దారుణంగా మోసం చేసిన RGV.
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు తమిళ కన్నడ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేశ్వరి అమ్మాయి కాపురం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక ఈమెకు గులాబీ సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
ఇలా తెలుగు తమిళ హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన మహేశ్వరి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే గులాబీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది హీరోయిన్ మహేశ్వరి. ఆ తరువాత ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా.. అందరి మనసులో ఆమె అపురూప సౌందర్యం, అభినయం ఇప్పటికీ అలాగే దాగి ఉంది.
తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఈ భామ… టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై సంచలన ఆరోపణలు చేసింది. ” దెయ్యం ” సినిమా షూటింగ్ మేడ్చల్ లోని వర్మ ఫామ్ హౌస్ లోజరిగిందని.. అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు 2 కిమీల దూరం ఉంటుందని నటి మహేశ్వరి చెప్పారు.
అక్కడ శ్మశానం సెట్ చేశారని.. రాత్రి ఒంటి గంటకు ఎవరైనా మెయిన్ రోడ్డు వరకు ఒంటిరిగా వెళ్లొస్తారా అని అడిగారని.. వెళ్లి వస్తే.. రూ.50 వేలు ఇస్తానని రామ్ గోపాల్ వర్మ అన్నారని మహేశ్వరి చెప్పారు. దీంతో రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు వెల్లడించారు నటి మహేశ్వరి. అయితే.. ఒంటిరిగా వెళ్లి వచ్చినప్పటికీ.. రామ్ గోపాల్ వర్మ ఇంకా ఆ డబ్బులు ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేసింది.