ఈ విషయాలు తెలియక బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారు, లేదంటే..?
బియ్యం కడిగిన నీటిని వడగట్టి.. ముఖానికి రాసుకోవడం, జుట్టుకు రాసుకోవడం చేయాలి. పావు గంట తర్వాత స్నానం చేస్తే.. చర్మానికి మేలు చేకూరుతుంది. ఇంకా జుట్టు పెరుగుతుంది. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని కడిగితే మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. చర్మం ప్రకాశవంతమవుతుంది. రోజుకోసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడిబారినట్లు కనిపిస్తే.. బియ్యం కడిగిన నీటిని మాడుకు జుట్టుకు పట్టించి 15 నిమిషాలకు తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.
అయితే మనిషి జీవించాలంటే నీటితో పాటు అన్నం తినడం కూడా అంతే ముఖ్యం.అన్నంను వేస్ట్ గా పడేయేకూడదు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం వండాలంటే తప్పనిసరిగా బియ్యం అవసరం. అన్నం వండడానికి ముందు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత వండుతాము. అయితే చాలామంది బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటారు. కానీ బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటుగా మృదువుగా ఉంటుంది.
ఎందుకంటే బియ్యం కడిగిన నీటిలో బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఒక్కోసారి వేడి చేసి నోటిపూత వస్తుంది. అలాంటి అలాంటప్పుడు బి కాంప్లెక్స్ టాబ్లెట్ లను వాడడానికి బదులుగా బియ్యం కడిగిన నీటిని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో బియ్యం కడిగిన నీరు ఎంతగానో ఉపయోగపడతాయి.బియ్యం కడిగిన నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది.
చుండ్రు సమస్య ఉన్నవాళ్లు, జుట్టు ఎక్కువగా ఉడిపోతున్న వాళ్ళు బియ్యం కడిగిన నీటిని తలకు పట్టించి కాసేపు అయ్యాక తల స్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖంపై మొటిమలతో బాధపడుతున్నవారికి బియ్యం కడిగిన నీరు బెస్ట్ అనే చెప్పాలి. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవడం వల్ల మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి.చూసారు కదా బియ్యం కడిగిన నీటి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇంకోసారి ఈ వాటర్ ను పారబోయేకుండా జాగ్రత్త చేసుకోండి.