రోజా ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెడుతారు, ఎన్ని కోట్లంటే..?
రోజా..తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసారు..MLA గా రెండు సార్లు తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసి అప్పట్లో ఓడిపోయారు..ఆ తర్వాత ఆమె వైసీపీ పార్టీ లో చేరి రెండు సార్లు నగరి స్థానం నుండి MLA గా గెలుపొందిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆమె మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఇక మినిస్టర్ రోజా ఆస్తుల విషయానికొస్తే..
2019 ఎన్నికల సందర్భంగా సమర్ఫించిన ఎన్నికల అఫిడవిట్ విషయానికొస్తే.. రూ. 7 కోట్ల 38 లక్షలకు పైగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఆమె భర్త సెల్వమణి పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని స్పష్టం చేశారు. ఆమె కుమారుడు కృష్ణ కౌశిక్, కుమార్తె అన్షు మాలిక పేర్ల మీద రూ. 50 లక్షల 56వేల 191ల డిపాజిట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. రోజాకు కార్లంటే అమితమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆమె పేరు మీద 7కు పైగా కార్లున్నట్టు పేర్కొంది. మొత్తంగా స్ధిరాస్తి రూ. 4,64,20,669 కోట్ల ఆస్తి మీదుంది.
చరాస్తి మొత్తం రూ. 2,74,17,761 కోట్ల చరాస్తులున్నాయి. అప్పుల విషయానికొస్తే.. రూ. 49 లక్షల 85 వేల అప్పులున్నాయి. ఇక 2019లో రోజా కార్ల విలువ.. రూ. 1,08,16,564 ఉంది. 2017-18 ఈమె ఆదాయ పన్నుశాఖకు రూ. 52.63,291 పన్నులు కూడా చెల్లించారు. ఈ కార్ల విలువ రూ.1,08,16,564లుగా చూపించారు. మినిష్టర్ రోజా భర్త సెల్వమణి పేరుతో ఉన్న ఆస్తులు విషయానికొస్తే.. ఆమె భర్త పేరు మీద ఎలాంటి స్థిరాస్థులు లేవు.
చరాస్థి విషయానికొస్తే.. 58,02,953 ఉంది. అప్పులు రూ. 22 లక్షల దాకా అప్పులున్నాయి. దాంతో పాటు హైదరాబాద్, చిత్తూరు, చైన్నెలో కూడా సొంత ఇళ్లులున్నాయి. ఇక తల్లిదండ్రులు ఇతరులు పేర్లు మీద ఇళ్లు పొలాలున్నాయి. వాటన్నింటినీ కలిపితే దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏమైనా సినీ రంగంలో ఉంటూ దక్షిణాదిలో జయలలిత తర్వాత ఇన్ని దక్కా మొక్కీలు తిని మంత్రిగా స్థానం సంపాదించిన రోజా ముందు ముందు రాజకీయంగా ఎలాంటి ఉన్నత స్థానం పొందుతుందో చూడాలి.