ఇండస్ట్రీలో మరో విషాదం, RRR సినిమా నటుడు కన్నుమూత.
రే స్టీవెన్ సన్ ఉత్తర ఐర్లాండ్ లోని లిస్బర్న్ లో 1964లో జన్మించారు. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్ లో చదివిన తర్వాత రే స్టీవెన్ బ్రిటీష్ టెలివిజన్ లో కొద్ది సంవత్సరాల పాటు పనిచేశారు. అనంతరం 1998లో ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’తో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. అయితే టీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
నిన్న మధ్యాహ్నమే సీనియర్ నటుడు శరత్ బాబు మరణించారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, RRR సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైన రే స్టీవెన్ సన్ మరణించారు. హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ 58 ఏళ్ళ వయసులోనే ఇటలీలో ఓ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిన్న మే 22 రాత్రి మరణించారు.
RRR సినిమాలో బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్స్‌టన్ పాత్రలో నటించి మెప్పించారు. క్లైమాక్స్ ఫైటింగ్ సీన్స్ లో మరింత మెప్పించారు రే స్టీవెన్ సన్. RRR సినిమాతో ఇండియాలోనే కాక ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. రే స్టీవెన్ సన్ పలు బ్రిటన్, హాలీవుడ్ సినిమాలలో నటించారు.
థోర్, ట్రాన్స్‌పోర్టర్ సినిమాలతో రే స్టీవెన్ సన్ బాగా పాపులర్ అయ్యారు. ఆయన చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రే స్టీవెన్ సన్ మరణంతో RRR చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించారు. పలువురు హాలీవుడ్, బ్రిటన్ ప్రముఖులు రే స్టీవెన్ సన్ కు నివాళులు అర్పిస్తున్నారు.
What shocking news for all of us on the team! 💔
— RRR Movie (@RRRMovie) May 22, 2023
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi