చిత్ర పరిశ్రమలో విషాదం, సీనియర్ నటి కన్నుమూత.
హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించిన లలిత.. ‘తారే జమీన్ పర్’ సినిమాలో ఆర్ట్ టీచర్ గా కనిపించారు. ఆమె మృతి వార్తను జహంగీర్ నికల్సన్ ఆర్ట్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లలిత చిత్రలేఖనంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, దేశంలో ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరిగా ఎదిగారు. తాను వేసిన పెయింటింగ్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీల్లో ఎగ్జిబిట్ చేశారు.
అయితే చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి లలిత లాజ్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లలిత.. బాలీవుడ్లెజండరీ హీరో గురుదత్ సోదరి. బాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది లలిత.
ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన తారే జమీనే పర్ సినిమాలో ఆమె నటన అద్భుతం.ఇందులో సూపర్ స్టార్ ఆర్ట్ టీచర్‌గా ఆమె నటించారు. ఆమె మృతి వార్తను జహంగీర్ నికల్సన్ ఆర్ట్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లలిత ఒక పెయింటర్. సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్.. తనకు తానుగా ఆమె ఈ క్లాసికల్ కళను నేర్చుకున్నారు. లాజ్మీ మొదట్లో ఆమె వ్యక్తిగత జీవితం మరియు పరిశీలనల నుంచి రచనలు చేసేవారు. ఆ తరువాత ఆమె స్త్రీ- పురుషుల మధ్య దాగి ఉన్న ఉద్రిక్తతను ఆధారంగా చేసుకొని రచనలు చేసేవారు.
ఆమె రచనలు ఆమె సోదరుడు గురుదత్, సత్యజిత్ రే మరియు రాజ్ కపూర్ వంటి భారతీయ చిత్రాల ద్వారా కూడా ప్రభావితమయ్యాయి. లాజ్మీ మరణ వార్త విన్న బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.