ఉదయాన్నే ఉప్పు నీరుతో నోరు పుక్కిలిస్తే ఎంత మంచిదో తెలుసా..?
రోజు ఒక గ్లాసు ఉప్పు నీరు నోట్లో వేసుకుని పుక్కిలించి వేయాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన ప్రభావం తగ్గుతుంది. పచ్చి క్యాప్షికం తినడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య లేకుండా పోతుంది. ఇందులో ఉండే విటమిన్ సి నోటి దుర్వాసనను అరికడుతుంది. అయితే నోటిని పుక్కిలించడం అనేది మనం సాధారణంగా చేసే చర్య. నోటి పరిశుభ్రతలో భాగంగా బ్రషింగ్ చేసేటపుడు లేదా ఏదైనా తిన్న తర్వాత నీటితో నోరు కడుక్కోవడం, నోటిని పుక్కిలించడం చాలా అవసరం. ఇది మీ నోటి ఆరోగ్యాన్నే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే ఒక ప్రయోజనకరమైన అలవాటు.
నోరు పుక్కిలించడం ద్వారా అది మీ నోటిలో చిక్కుకున్న ఆహార కణాలు, బ్యాక్టీరియా, ఇతర శిధిలాలను తొలగించడంలో సహాయపడుతుంది. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి వంటి దంత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదనంగా, మీ శ్వాసను తాజాగా చడంలో సహాయపడుతుంది. భారతదేశంలో ఈ అభ్యాసం తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఒక ఆచారంగా ఉంది. కొంతమంది వేప ఆకులు లేదా పసుపు పొడి వంటివి వాడుతూ నోరు పుక్కిలిస్తారు. ఇవి యాంటీమైక్రోబయల్ గుణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్లను దూరం చేయవచ్చు. అయితే నోటి పరిశుభ్రత కోసం ఉపునీటితో నోరు పుక్కిలించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని దంత ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఉప్పు నీరు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చిగుళ్ళ వాపు వంటి సమస్యలను నివారిస్తుంది. తరచుగా చిగుళ్ల వాపు, ఇన్‌ఫెక్షన్‌లు వంటివి నోటిలో బ్యాక్టీరియా అధికంగా పేరుకుపోవడం వలన కలుగుతాయి. దీనివలన నోటిలో నొప్పి, మంట కలుగుతుంది. మీ చిగుళ్ళు గులాబీ నుండి ఎరుపు రంగులోకి మారడాన్ని మీరు గమనించవచ్చు. తర్వాత, మీరు మీ దంతాలను బ్రష్ చేసినప్పుడు లేదా ఫ్లాస్ చేసినప్పుడు మీ చిగుళ్ళలో రక్తస్రావం అవుతుంది. చిగురువాపుకు చికిత్స చేయకపోతే, అది చిగుళ్ల క్షీణత, పీరియాంటల్ వ్యాధికి దారితీస్తుంది. ఈ సమస్యను చిన్న చిట్కాతో దూరం చేసుకోవచ్చు.
ఉప్పు నీరు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది కాబట్టి, ఉప్పు నీటితో పుక్కిలించడం, గోరువెచ్చని ఉప్పు నీటితో మీ నోటిని కడుక్కోవడం వల్ల అది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ కాకపోయినా, వారంలో కొన్ని సార్లు గోరువెచ్చని ఉప్పు నీటితో గార్గిలింగ్ చేయండి. ఉప్పునీటితో మీ నోరు కడిగేటప్పుడు, నీటిలో ఎక్కువ ఉప్పు కలపవలసిన అవసరం లేదు. సగం కప్పు నీటిలో 1/4 టీస్పూన్ ఉపయోగించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఆ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత, నోటిని శుభ్రం చేసుకోండి లేదా పుక్కిలించండి.
ఇలా రోజుకి రెండు సార్లు వారానికి కొన్నిసార్లు ఉప్పు నీటితో పుక్కిలించాలి. గొంతునొప్పికి కూడా ఈ చిట్కా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు రోజుకి నాలుగు సార్లు ఉప్పునీటితో పుక్కిలించడం మంచిది. నోటి పూతలు, నోటి అల్సర్లు వంటి సమస్యలు కూడా ఉప్పు నీటితో పుక్కిలించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. గొంతు నొప్పికి కారణమయ్యే కొన్ని అంటువ్యాధులు- ఫ్లూ, జలుబు, స్ట్రెప్ థ్రోట్, సైనసిటిస్, మోనోన్యూక్లియోసిస్ వంటి వాటికి చికిత్స చేస్తుంది.