News

అమ్మను కావాలని ఉంది అంటూ.. తన మనసులోని మాట చెప్పిన సమంత.

వెబ్ సిరీస్ లో సమంత ఓ బిడ్డకు తల్లిగా నటించింది. ఆ అనుభవం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ ‘సిటాడెల్‌’ వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతుల్ని పంచిన సిరీస్‌. ఇందులో భారీ యాక్షన్‌ సీన్స్‌లో నటించా. హీరోలకు ఏ మాత్రం తీసిపోని పాత్రలు చేయాలని నేనెప్పుడూ కోరుకుంటా. అలా ంటి పాత్రనే ‘సిటాడెల్‌’లో చేశా. ఆలాగే ఓ బిడ్డకు తల్లిగా నటించడం మరిచిపోలేని అనుభవం. అయితే ఇది ఇలా ఉంటే సమంత తాజాగా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో సమంత రాజ్‌ అండ్‌ డీకే మాట్లాడుతూ..ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 షూట్‌ సమయంలో నేను ఎన్నోరకాల భావోద్వేగాలతో సతమతమయ్యాను అని సమంత తెలిపింది. అలాగే వారి దర్శకత్వంలో నటించడం కష్టం అనిపించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ. హనీ బన్నీ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాకు తల్లి కావాలని కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని తాను అనుకోవడం లేదు. ప్రస్తుతం నేను తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సమంత ఈ వాఖ్యలు చేసిన తర్వాత మరోసారి ఆమె రెండవ పెళ్లికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. గతంలో ఆమె రాజ్ అండ్ డీకే లో రాజ్ తో ప్రేమలో మునిగితేలుతోందని అతన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మరోసారి తల్లి కావాలని ఉంది అంటూ కామెంట్స్ చేయడంతో సమంత రెండో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో ఆమె రాజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలపై సమంత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker