Health

సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి ఎంత భయంకరమైనదో తెలుసా..? వ్యాధి లక్షణాలు ఇవే.

ప్రస్తుత కాలంలో మనుషులకు ఎలాంటి వ్యాధులైన సోకవచ్చు. కొన్ని సార్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ సమంత హెల్త్ విషయంలో ఎంతో కేరింగ్ గా ఉంటుంది. ఆమెకి ఇలా భయంకర వ్యాధి ఎలా సోకింది అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని కూడా చెప్పింది. ఈ విషయం తెలియడంతో అంతా షాక్ అయ్యారు.

అయితే అసలు ఏంటీ వ్యాధి.. ఎందుకు వస్తుంది..? ఎవరికి ఎక్కువగా వస్తుంది…? సమంతకు రావడానికి కారణం ఏంటీ..? అసలు ఈ మయోసైటిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా మంది ఈ విషయంపై గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు. దీని వల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్‌నే ‘మయోసైటిస్ అని అంటున్నారు డాక్టర్లు.

అయితే ఈ వ్యాధి రకరకాలుగా ఉంటుంది. అందులో సమంతకు వచ్చిన వ్యాధి ఏ రకమో ఆమె తెలుపలేదు. ఈ వ్యాధితో బాధపడేవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. మయోసైటిస్ లో చాలా రకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా వచ్చేవాటిలో పాలిమయోసైటిస్ ఒకటి. ఇది వచ్చినవారికి కండరాల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా తొందరగా అలిసిపోతారు. కొంత దూరం నడిస్తే ఆయాసపడతారు.. అంతే కాదు ఒక్కోసారి తెలియకుండానే కింద పడిపోతారు. ఇక మరో రకం డెర్మటోమయోసైటిస్. దీని వల్ల వాపు కూడా ఉంటుంది. పిల్లలు మహిళల్లో దీని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చర్మంపై దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి వారిని చాలా ఇబ్బంది పెడతాయంటున్నారు డాక్టర్లు. ఇక మూడో రకం ఇన్ క్లూజన్ బాడీ మయోసైటిస్ దీని వల్ల భుజాలు, నడుము, తొడ కండరాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ముంజేతి, మోకాలి కండరాలు ఈ వ్యాధి వల్ల ప్రభావితం అవుతాయి. అవి పట్టేస్తాయి.. బాగా నొప్పి కూడా ఉంటుంది. దీని వల్ల వ్యాధిగ్రస్తులు బాగా నీరసానికి గురవుతారు. ఇది ఎక్కువగా 50 ఏళ్ళు దాటినవారికి సంక్రమిస్తుంది. ఒక్కోసారి మయోసైటిస్ ప్రభావం తీవ్రత పెరిగితే అది శరీరంలోని ఇతర భాగాలన్నింటిపై కూడా ప్రభావం చూపిస్తుంది. చర్మం, ఊపిరితిత్తులు, గుండెపై ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి ఒక్కోసారి ఊపిరి తీసుకోవడం, మింగడం కష్టంగా మారుతుంది. ఈ వ్యాధికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ లేదు. ఉపశమనానికి మందులు మాత్రమే ఉన్నాయి.

అంతే కాదు ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరు వీల్ చైర్ కు పరిమితం అవ్వవచ్చు.. లేదా పంచానికే పరిమితం అవ్వొచ్చు. కాని తమ జీవన శైలిలో మార్పులు, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు ఎక్కువ కాలం జీవించేలా కాపాడతాయి. ఇవన్నీ పాటించకపోతే 5 ఏళ్ళలోపే పేషంట్ మరణించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సమంతకు ఏరకం మయోసైటిస్ వచ్చింది అన్న విషయంలో క్లారిటీ లేదు. కాని సమంత యంగ్ ఏజ్ లోనే ఉంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకుంటూ.. మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్నే ఆమె కూడా వెల్లడించారు. నేను చాలా వరకూ కోలుకున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు సమంత.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker