ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మరిపోయిందో చుడండి.
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో జూనియర్ ఐశ్వర్యారాయ్ గా నటించి మెప్పించిన అమ్మాయి పేరు సారా అర్జున్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన పాప. ఆ సినిమాలో సారా తన నటనతో అందర్నీ మెప్పించి ఏడిపించింది కూడా. నాన్న సినిమాలోని విక్రమ్ – సారా మధ్య సన్నివేశాలు ఇప్పటికి చాలా మంది ఇష్టపడతారు. ఆ సినిమా చేసినప్పుడు సారాకి కేవలం ఐదేళ్లు.
2011 లో వచ్చిన నాన్న సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. నాన్న సినిమా తర్వాత సారా అర్జున్ అనేక తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇప్పుడు సారాకు 17 ఏళ్ళు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యారాయ్ యువతిగా ఉన్నప్పటి పాత్రలో నటించి తన అందంతో, నటనతో ప్రేక్షకులని మెప్పించింది. దీంతో ప్రేక్షకులు, పలువురు ప్రముఖులు ఆమెను మెచ్చుకుంటూ భవిష్యత్తులో కచ్చితంగా హీరోయిన్ అవుతావని అంటున్నారు.
మరి సారా భవిష్యత్తులో ఏ సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఇంకెంత పేరు సంపాదిస్తుందో చూడాలి. అదేనండీ.. విక్రమ్, అనుష్క జంటగా నటించిన నాన్న సినిమాలో విక్రమ్ కు కూతురుగా నటించిన అమ్మాయి సారా. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోకపోయినా సారా నటనకు మాత్రం అవార్డులు కూడా దక్కాయి. మతిస్థిమితం లేని ఒక తండ్రి.. అతడి తండ్రి ప్రేమను అర్ధం చేసుకొనే కూతురుగా ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ చిన్నారి హీరోయిన్ గా మారింది.
పొన్నియిన్ సెల్వన్ లో అలా వచ్చి ఇలా మాయమైపోయినా పార్ట్ 2 లో మాత్రం అదరగొట్టింది. చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ గా, కరికాలన్ ను ప్రేమించిన నందినిగా సారా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. విచిత్రం ఏంటంటే.. నాన్న లో విక్రమ్ కు కూతురిగా నటించిన సారా.. ఈ సినిమాలో చిన్నప్పటి విక్రమ్ కు ప్రేయసిగా నటించింది.
పార్ట్ 2 లో ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మీ లాంటి అందగత్తెల మధ్యలో సారా తేలిపోకుండా.. తనదైన మార్క్ చూపించింది. వారికన్నా ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయే పాత్రతో మెప్పించింది. ఈ సినిమా తరువాత సారాకు హీరోయిన్ గా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి తెలుగులో ఈ చిన్నది ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.