శరత్ బాబు తన ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద రాశారో తెలుసా..? వీలునామాలో సంచలన విషయాలు.

హర్సిలీ హిల్స్ లో స్థిరపడాలనేది శరత్ బాబు చివరి కోరిక కాగా ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు.అక్కడ శరత్ బాబు ఇంటి నిర్మాణం కూడా చేపట్టగా ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు.శరత్ బాబు మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆర్గాన్ ఫెయిల్యూర్స్ తో తుది శ్వాస విడిచారు. శరత్ బాబు ఇక లేరని తెలిసి పలువురు సినీ నటులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కెరీర్ ఆరంభం నుంచే ఎంతో ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకెళ్లిన శరత్ బాబు.. బోలెడన్ని ఆస్తులు కూడబెట్టారట. పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తూ బోలెడంత ఆస్తి సంప్రదించారట. అయితే ఆయన మరణం తర్వాత ఈ ఆస్తి తాలూకు విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు సంతానం లేదు. దీంతో శరత్ బాబు ఆనారోగ్యం బారిన పడినప్పటినుంచే ఆ ఇంట ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. శరత్ బాబు దగ్గర ఉన్న ఆస్తి ఇప్పుడు ఎవరికి చెందాలి అనే దానిపై గొడవలు జరుగుతున్నాయని టాక్.
సినీ నటుడిగా కెరీర్ కొనసాగిస్తూనే శరత్ బాబు ఆస్తిపాస్తులు బాగానే కూడబెట్టారట. హైదరాబాద్, చెన్నై , బెంగళూర్ లో ఆయనకు ఇళ్లూ, స్థలాలూ, షాపింగ్ మాల్స్ ఉన్నాయని సమాచారం. అందుకే ఆయన మరణం తర్వాత ఆస్తి తగాదాలు పెద్ద ఇష్యూ అయ్యాయని అంటున్నారు. ఆయన ఆస్తికి ఇప్పుడు వారసులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే తన ఆస్తి మొత్తం కూడా తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ పిల్లల పేరు మీద వీలునామా రాశారట శరత్ బాబు. ఆయన మరణం తర్వాత ఈ విషయం బయటపడింది.
శరత్ బాబు మరణించిన తర్వాత ఓ సోదరి సరిత స్పందిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. తన అన్న మరణాన్ని తలచుకుని ఎంతో బాధపడిన ఆమె.. తనకు తల్లి తండ్రి మొత్తం శరత్ బాబు అన్నయ్యే అంటూ బోరున విలపించారు. తన కొడుకును చదివిన్చడమే గాక కుమార్తె పెళ్లి కూడా చేశారని చెప్పారు. చివరగా తన కుమార్తె సోనియా డెలివరీ కోసం బెంగుళూరు వచ్చారని.. సోనియాని దత్తత తీసుకుంటాను అని అన్నయ్య చాలా సార్లు అన్నారని శరత్ బాబు చెల్లెలు చెప్పారు. తన కుమార్తెని దత్తత తీసుకోవాలనే ఆలోచన అన్నయ్యకి ఉన్నప్పటికీ అది జరగలేదని ఆమె చెప్పారు.
1973లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు.. రామరాజ్యం అనే మూవీతో తొలిసారి ప్రేక్షకుల ముందుకుకొచ్చారు. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి తన మార్క్ చూపించారు శరత్ బాబు. తమిళ, కన్నడ మలయాళ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేసి అక్కడ కూడా అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు.