News

నాలుగేళ్లుగా నరకం. గుండె నిండా బాధను భరిస్తున్న కట్టప్ప.. కూతురు ఎమోషనల్ పోస్ట్.

సత్యరాజ్.. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ కి తండ్రిగా నటించారు. అలాగే ‘ప్రతిరోజు పండగే’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి తాతయ్యగా కూడా నటించిన ఈయన కెరియర్ తొలిరోజుల్లో విలన్ పాత్రలు పోషించి, ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయారు. అయితే సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితం. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు తండ్రిగా, తాతగా వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ఇక యంగ్ రెబల్ స్టార్ నటించిన బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరానికి కట్టప్ప పాత్రగానే ఫేమస్ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు సత్యరాజ్. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే సత్యరాజ్ గుండెల్లో అంతులేని బాధను మోస్తూ తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. గత నాలుగేళ్లుగా వ్యక్తిగత జీవితంలోని తన బాధను బయటపెట్టకుండా సినిమాల్లో రాణిస్తున్నారు. సత్యరాజ్ భార్య మహేశ్వరి గత 4 సంవత్సరాలుగా కోమాలో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. “నా తల్లి గత 4 సంవత్సరాలుగా కోమాలో ఉంది.

ఆమెకు PEG ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నాము. మేము పూర్తిగా దిగ్ర్భాంతిలో ఉన్నాము.. కానీ ఆమె కోలుకుంటుంది అనే ఆశతోనే ఎదురుచూస్తున్నాము. అమ్మ మమ్నల్ని తిరిగి కలుస్తుంది. గత నాలుగేళ్లుగా మాకు అమ్మ, నాన్న అన్ని మా నాన్నే. మా నాన్న బెస్ట్ సింగిల్ పేరెంట్. కొన్నేళ్ల క్రితమే మా నాన్న తన తల్లిని కోల్పోయాడు. దీంతో నేను మా నాన్నకు సింగిల్ మామ్ గా ఉన్నాను. మాన నాన్న, నేను ‘పవర్‌ఫుల్ సింగిల్ మామ్స్ క్లబ్’లో ఉన్నాము ” అంటూ రాసుకోచ్చింది.

దీంతో సత్యరాజ్ వ్యక్తిగత జీవితంలోని బాధ తెలిసి చలించిపోతున్నారు అభిమానులు. సత్యరాజ్, మహేశ్వరి ఇద్దరూ 1979లో వివాహం చేసుకున్నారు. వీరికి సిబిరాజ్ అనే కుమారుడు, దివ్య అనే కుమార్తె ఉన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker