ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, అనారోగ్యంతో సీనియర్ నటుడు మృతి.
గత కొంతకాలంగా అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు కొచ్చు ప్రేమన్ .. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కొచ్చు ప్రేమన్ డ్రామా ఆర్టిస్టుగా తన నటనా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా రంగ ప్రవేశం చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారు.
అతను ఎక్కువగా కామెడీ పాత్రలు పోషించారు. అయితే ఆయన కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. తన కెరియర్ లో ఎక్కువగా సినిమాల్లోని కామెడీ రోల్స్ చేశారు. రెండు దశాబ్దాల పాటు ఆయన ఆయన సుమారు 200 పైగా సినిమాల్లో నటించి మలయాళ సినీ పరిశ్రమకు తన సేవలు అందించారు. ముందుగా నాటక పరిశ్రమ ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన ఆ తరువాత సినీ రంగంలోకి ప్రవేశించి 20 దశాబ్దాల పాటు 200 సినిమాల్లో నటించారు.
ఆయన తిరువనంతపురంలో పుట్టి పెరిగి సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత నాటకాల ద్వారా నటుడిగా నిరూపించుకుని సినీ రంగ ప్రవేశం చేశారు. శ్రీకృష్ణపురతే నక్షత్రతిలక్కం , మట్టుపెట్టి మచ్చన్ , ఇరట్టక్కుట్టికలుడే అచ్చన్ , పట్టాభిషేకం , గురు , తెంకాసి పట్టణం , కళ్యాణ రామన్ సహా తిలక్కం వంటి అనేక ప్రసిద్ధ మళయాళ సినిమాల్లో కొచ్చు ప్రేమన్ నటించారు.
త్రివేండ్రం లాడ్జ్ , ఆర్డినరీ , ఓజిమూరి , యాక్షన్ హీరో బిజు , కార్బన్, ది ప్రీస్ట్ వంటి తాజా సినిమాల్లో కూడా ఆయన కనిపించారు. ఇక అయన టెలివిజన్‌లో కూడా సత్తా చాటారు. వివిధ మలయాళ ఛానెల్‌లలో అనేక ప్రముఖ సీరియల్స్‌లో నటిస్తున్నారు.ఇక ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు పలువురు నటీనటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు.