News

ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో అజిత్ భార్య షాలిని, అసలేం జరిగిందంటే..!

గత ఏడాది ‘మార్క్ ఆంటోని’ సినిమాతో భారీ హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతోనే మైత్రీ నిర్మాతలు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట టాప్ హీరోల్లో ఒకరిగా అజిత్ కొనసాగుతున్నారు. ఎంత మంది యంగ్ హీరోలు వచ్చినా సరే.. అజిత్ ఉండే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అనేక విభిన్నమైన సినిమాల్లో నటించి..ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఇక వెరైటీ పాత్రల్లో నటించేందుకు అజిత్ ఎప్పుడూ ముందుకు ఉంటారు. ప్రస్తుతం విడాముయర్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను లైకా ప్రోడక్షన్స్‌పై మగిళ్‌ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. అలానే సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అజిత్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందానా అని ఆయన ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. అజిత్ భార్య ఒకప్పటి హీరోయిన్ షాలిని ఆస్పత్రిలో చేరారు. అజిత్ పక్కనే తాను ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. అంతేకాక లవ్‌ యూ ఫరెవర్‌ అంటూ క్యాప్షన్‌ కూడా జోడించింది. షాలినికి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలుస్తోంది. మంగళవారం అజిత్ అజర్‌బైజాన్ నుండి చెన్నైకి వచ్చాడు. సర్జరీ చేయించుకున్న తన భార్యకు ధైర్యం అందించాడు. అయితే ఆమెకు ఏమైందని అజిత్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆమెకు ఏ ఆరోగ్య సమస్యపై ఆపరేషన్ జరిగిందా ఆరా తీస్తున్నారు. మొత్తంగా తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker