News

శరత్ బాబు తన మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

శరత్ బాబు మరణం తెలుగు, తమిళ పరిశ్రమల్లో పూర్తిగా విషాదాన్ని నింపింది.కమల్, రజిని, చిరంజీవి.. లాంటి స్టార్ పెద్ద హీరోలు శరత్ బాబుకి నివాళులు అర్పించారు. సౌత్ భాషల్లో దాదాపు 300 సినిమాలలో హీరోగా, విలన్ గా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతగానో మెప్పించారు శరత్ బాబు.అయితే ఇన్ని రోజులు తన జ్ఙాపకాలను నెమరేసుకుంటూ ఉన్న సోషల్ మీడియా.

ఒక్క సారిగా తన ఆస్తులు ఎవరికి? అనే ప్రశ్నలతో.. నిండిపోయింది. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఇదే విషయంగా చర్చ జరగుతోంది. తన కెరీర్ బిగినింగ్‌లోనే రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్‌ బాబు.. ఆమెతో పడలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత స్నేహలతను పెళ్లి చేసుకుని.. ఆమెతో కూడా విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత మూడో పెళ్లి కూడా చేసుకున్నారనే వచ్చినప్పటికీ.. ఆయన మాత్రం దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇలా తన వైవాహిక జీవితంలో దారుణంగా విఫలమైన శరత్ బాబు అప్పటి నుంచి తన 8 మంది అన్నదమ్ములు, 5గురు అక్కాచెల్లెళ్ల తోనే ఉమ్మడి కుంటుంబంలో కొనసాగుతున్నారు. లు చేస్తూ వారందరి బాధ్యతలు తీసుకోవడమే కాదు.

వారి పిల్లల బాధ్యతలను కూడా తనే తీసుకుని అందరికీ పెళ్లిల్లు చేశారు. తన ఆస్తులు కూడా తన ఉమ్మడి కుటుంబానికే అన్నట్టు చాలా సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. కానీ కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఆయన సన్నిహితుల ప్రకారం ఆయన ఒక వీలునామా రాశారని అంటున్నారు.

ఆ ప్రకారం తన ఆస్తి తన ఉమ్మడి కుంటుంబంలో ఉన్న 23 మందికి సమానంగా చెందుతుందని చెబుతున్నారు. కానీ మరికొంత మంది మాత్రం అలంటిదేం లేదని కొట్టిపారేస్తున్నారు. కాని శరత్‌ బాబు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాత్రం.. ఆయన దశదిన కర్మ అయిపోయేంత వరకు ఆస్తుల గురించి ఏం మాట్లాడమంటూ మీడియాకు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker