ఆర్యన్‌ను జైల్లో పెట్టొద్దని షారూక్ ఖాన్ వేడుకున్నారు, వెలుగులోకి షారూక్ ఖాన్ చాట్.
తనపై నమోదైన సీబీఐ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సమీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ను జైల్లో పెట్టొద్దని షారుక్ ఖాన్ తనను వేడుకున్నారని పేర్కొన్నారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు దేశమంతా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఓ క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు అప్పట్లో అంతే రేటింగ్ వచ్చింది. అయితే.. కొడుకును విడిపించాలంటూ తండ్రిగా షారూఖ్ చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు సమీర్ వాంఖడేనే వేడుకున్నారు. ఆర్యన్‌ను సేవ్ చేయాలని అడుక్కున్నారు.
అన్నీ నేను చూసుకుంటానని.. సమీర్ వాంఖడే షారూఖ్‌తో చాట్ చేశారు. ఆ వాట్సప్ చాటింగులన్నీ ఇప్పుడు టీవీ9 చేతిలో ఉన్నాయి. కొడుకు కోసం షారూఖ్ పడిన తపన తీరు ఆ చాటింగ్స్‌లో కళ్లకు కడుతోంది. ఆర్యన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చి రిలీజ్ చేసింది. ఆ తర్వాత సమీర్ వాంఖడే చిట్టా తెరిచింది. ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు సమీర్..షారూఖ్‌ను 25 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలొచ్చాయి.
ఆర్యన్ లంచం కేసునే సమీర్‌పై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు. వాంఖడే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ రిపోర్ట్..పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలు వెళ్లారని సీబీఐ చెబుతోంది.
ఐదేళ్లలో 2017 నుంచి 2021 వరకు.. సమీర్ వాంఖడే తన కుటుంబంతో యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు వెళ్లినట్లు ఆధారాలు సేకరించారు. వాంఖడే దగ్గర దాదాపు 20 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్ ఉందని..ముంబయ్‌లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని.. మరోచోట 41 ఎకరాల భూమి ఉన్నట్లు సీబీఐ అధికారులు లెక్క తేల్చారు. ఐదో ఫ్లాట్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని చిట్టా మొత్తం బయట పెట్టింది. ఇదే ఇప్పుడు వాంఖమే మెడకు చుట్టుకుంటోంది.