News

ఆ డైరెక్టర్ చేసిన పనికి అర్ధరాత్రి చెల్లిని పట్టుకొని ఏడ్చిన సాయిపల్లవి.

సాయిపల్లవి.. ఇటీవలే అమరన్ సినిమాతో మరోసారి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇందులో ఇందు రెబికా వర్గీస్ పాత్రలో మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే మొన్నటికి మొన్న సమంత.. రాజ్ అండ్ డీకే తో పనిచేయలేక మేనేజర్ తో చెప్పుకొని ఏడ్చినట్లు చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకరోజులో రెండు మూడు సీన్స్ మాత్రమే షూట్ చేస్తారు.. కానీ రాజ్ అండ్ డీకే షెడ్యూల్ మొత్తం ఒక రోజులోనే అవ్వాలని చూస్తారు.

దానికోసం ప్రతిఒక్కరిని షూట్ చేయాలనీ కంగారుపెడతారు. దానివలన నేను చేయలేక మేనేజర్ తో చెప్పుకొని ఏడ్చాను. ఆ తరువాత వారి పనికి అలవాటు పడ్డాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు సమంతలానే సాయిపల్లవి కూడా ఒక డైరెక్టర్ ఏడ్పించాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా తరువాతనే సాయిపల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఆ డ్యాన్స్ కు, ఆమె నటనకు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా మొత్తంలో సాయిపల్లవి సీన్స్ అన్ని నైట్ సమయంలోనే జరిగాయి.

ఇక ఆ టైమ్ లో ఆమె చాలా ఏడ్చినట్లు చెప్పుకొచ్చింది. ” నాకు నైట్ పడుకోకపోతే ఉదయం నిద్ర పట్టదు. శ్యామ్ సింగరాయ్ షూట్ అంతా నైట్ జరిగింది. అన్ని సీన్స్ అయ్యేవరకు రాహుల్ వదిలేవాడు కాదు. అవన్నీ అయ్యేవరకు అలానే మెలకువతో ఉండేదాన్ని. ఉదయమే నిద్ర వచ్చేది కాదు. చాలా ఇబ్బందిపడ్డాను. ఒకరోజు సెట్ కు చెల్లి వస్తే.. తనను పట్టుకొని ఏడ్చేసాను. వెంటనే తను వెళ్లి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో మాట్లాడింది. ఒక రెండు రోజులు అక్కకు రెస్ట్ కావాలి అని అడిగింది. వారు రెండు రోజులు కాదు.. పదిరోజులు తీసుకోండి పర్లేదు అని చెప్పారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker