News

అప్పటి స్టార్ యాంకర్, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

గతంలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే హోస్టులుగా సందడి చేసేవారు. అందులో బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి ఒకరు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలో తనదైన శైలి యాంకరింగ్‌తో సందడి చేసిన ఈ భామ.. వివాహం తర్వాత కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. అయితే శిల్పా చక్రవర్తి ..పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించింది. స్మాల్ స్ర్కీన్‌పై మెరుస్తూనే నువ్వే నువ్వే లాంటి ల్లో కూడా కనిపించి ఆకట్టుకుంది.

కాగా శిల్పాది బెంగాళీ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపడింది. ఆమె విద్యాభాస్యం సికింద్రాబాదు లోని రైల్వే స్కూల్, కాలేజ్ లో గడించింది. ఇక శిల్పా మంచి కథక్ నృత్యకారిణి. కాగా మొదట మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఆ తర్వాత బుల్లితెర వైపు మొగ్గు చూపింది. ‘వావ్: ది అల్టిమేట్ గేమ్ షో’ తో బుల్లితెర యాంకర్‌గా పరిచయమైంది.

ఆతర్వాత ‘కంటే కూతురినే కనాలి’ సీరియల్‌లోనూ నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, భలే జోడీ వంటి టాప్‌ టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన శిల్ప చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది. షోలు మాత్రమే కాదు ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతోనూ సందడి చేసింది.

కాగా యాంకర్‌గా, నటిగా బిజీగా ఉంటున్న సమయంలోనే శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆతర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారిపోయింది. ఇక పిల్లల బాధ్యతలు భుజాన పడడంతో తన యాంకరింగ్‌ అండ్‌ యాక్టింగ్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. అయితే 2019లో బిగ్ బాస్ మూడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించింది. అయితే రెండు వారాల తర్వాత ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్లిపోయింది.

ఇక ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోందీ అమ్మడు. తన ఫ్యామిలీ ఫొటోలును తరచూ షేర్‌ చేస్తుంటుంది. ఇవి చూసిన నెటిజన్లు శిల్ప అందం ఏ మాత్రం తగ్గలేదని, ఇప్పటికీ అలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker