ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో కలిసి నటించిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
హీరోయిన్ నగ్మా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని పొందింది. హీరోయిన్ నగ్మా నట వారసత్వంగా ఇండస్ట్రీలో పరిచయమైన ఆమె చెల్లెలు జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జ్యోతిక వైవిధ్యమైన పాత్రల్లో ఎక్కువగా నటించి తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ్, కన్నడ ,మలయాళీ భాషల్లో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలు నటించి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొంతకాలం తన హవాను కొనసాగించింది.
బ్యూటీ హీరోయిన్ నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా చాలా సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఏ ముగ్గురు హీరోయిన్స్ తో నటించిన ఏకైక హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఇప్పటికి హీరోగా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ భామల్లో జోతిక మినహా మిగిలిన వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..!
ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ఆ స్టార్ హీరో నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరంటే.. ఇంకెవరు మన మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి పైన కనిపిస్తున్న ముగ్గురు సిస్టర్స్ తో సినిమాలు చేశారు. ఈ భామలు చిరు సరసన హీరోయిన్స్ గా నటించిన సినిమాలు ఏవంటే..
నగ్మా , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాల్లో ఘరానా మొగుడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే జోతికతో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఠాగూర్.వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రోషినితో కలిసి చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించారు.