కింద కూర్చుని భోజనం తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
అప్పటిలా కాకుండా అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు, ఇంటిల్లిపాది కలిసి కూర్చుని తినే సమయం కూడా లేకుండా పోయింది. అంతా బిజీబిజీ..ఎవరి టైమ్ వారిది.. ప్రశాంతంగా కలిసి కూర్చుని తినే సమయం అసలే లేకుండా పోయింది. కానీ, అలా డైనింగ్ టేబుల్‌పై కూర్చుని తినే అలవాటు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
కింద కూర్చుని భోజనం చేయడం వలన అద్భుతమైన లాభాలను పొందొచ్చు. పైగా మీకు ఈ సమస్యలు కూడా ఉండవు. మెదడు రిలాక్స్ గా ఉంటుంది.. కింద కూర్చుని భోజనం చేయడం వలన మెదడు చాలా రిలాక్స్ గా ఉంటుంది. నేలపై సుఖాసనంలో కూర్చుని మనం తింటే ఫోకస్ పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలానే మనసు కూడా ఫ్రీగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
ఆక్సిజన్ సర్కులేషన్ పెరుగుతుంది. బరువు తగ్గచ్చు.. కింద కూర్చుని భోజనం చేయడం వలన బరువు తగ్గడానికి కూడా అవుతుంది. పైన కూర్చుని మనం తినడం వలన ఎంత తిన్నాము అనేది మనకి తెలియదు. కానీ మనం కిందకి వంగి భోజనం చేస్తే ఏకాగ్రత పూర్తిగా పెట్టొచ్చు. కనుక మనకి సరిపడా భోజనం మనం తినొచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది.. కింద కూర్చుని మనం భోజనం చేయడం వలన జీర్ణ క్రియ కూడా బాగుంటుంది.
నేల మీద కూర్చుని తినేటప్పుడు వంగి తిని మళ్ళీ మనం మన పొజిషన్లోకి వస్తాము దీని మూలంగా జీర్ణ రసాలు బాగా రిలీజ్ అవుతాయి కనుక జీర్ణం బాగా అవుతుంది. బ్లడ్ సర్కులేషన్.. సుఖాసనంలో కూర్చుని భోజనం చేయడం వలన పాదాలకి రక్త ప్రసరణ తగ్గుతుంది అదనపు రక్తాన్ని గుండె ద్వారా ఇతర భాగాలకు వెళ్తూ ఉంటుంది దీంతో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది.