Health

నిద్ర పట్టట్లేదా..? ఈ టిప్స్ తో క్షణాల్లోనే నిద్రపోతారు.

నిద్ర ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. అయితే ఆధునిక జీవన శైలి, నేటి ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. అంతేకాకుండా కొన్ని అనారోగ్యాల కారణాలవల్ల వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం వాడే.. టాబ్లెట్స్ వల్ల కూడా నిద్రలేమి సమస్యతో సతమతమవతున్నారు.

పూర్వం రోజుల్లో పగలంతా కష్టపడి అవ్వగానే కడుపునిండా తిని మంచిగా నిద్ర పోయేవారు.. అలా పడుకోగానే వెంటనే నిద్ర వచ్చేది.. కానీ ప్రస్తుతం శరీరానికి ఎక్కువ శ్రమ చేయపోవడం వలన నిద్రలేమి సమస్య చాలా ఎక్కువ ఉంది. రాత్రంతా సరిగా నిద్ర పోకపోవడం వలన ఆ రోజంతా ఏ పని చేయాలన్న బద్దకంగా శరీరం సహకరించకుండా ఉంటుంది. శరీరానికి సరిగా రెస్ట్ లేకపోవడం వలన హార్మోన్స్ బ్యాలెన్స్, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయి..

ఈ సమస్యను తగ్గించుకోవడానికి సుఖంగా నిద్ర పోవడం కోసం హాస్పటల్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. అయితే మన వంటింట్లో దొరికి కొన్ని ఆహార చిట్కాలతో సులువుగా నిద్ర పట్టే విధంగా చేసుకోవచ్చు. అదేమిటంటే ముందుగా ఒక పాత్ర తీసుకొని దానిలో గ్లాసున్నర పాలు పోసి బాగా మరిగించాలి.. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో రెండు స్పూన్ల తేనెను కలిపి భోజనం చేసిన తరువాత అరగంటకు ఈ పాలను తాగటం వలన..

పది నిమిషాలలో ఘనమైన నిద్ర వస్తుంది.. ఎన్ని హాస్పటల్ తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేదు అని అనుకునేవారు ఒక్కసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.. మంచి ఫలితం ఉంటుంది.. పాలు తేనెను కలిపి తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. దీన్ని అన్ని వయసుల వారు కూడా ఉపయోగించవచ్చు .. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఈ చిట్కాను ట్రై చేయవచ్చు. చిన్న పిల్లలు మంచి నిద్ర పోవటం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker