Health

నిద్రలో కాళ్ళు, పిక్కలు పట్టుకుంటున్నాయా. మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?

అతిగా శ్రమించేవాళ్ళు, ఎక్కవ సేపు నిలబడటం, నడవటం, పొగత్రాగే అలవాటు ఉన్నవాళ్ళు, ఒకే చోట కదలకుండా కూర్చునేవాళ్ళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. రక్తనాళాలలో అవరోధాలు, నరాల మీద వత్తిడి వంటి సమస్యల కారణంగా ఈ పిక్కల నొప్పి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఆ సమయంలో కాలు కదపడం కూడా అస్సలు సాధ్యపడదు. ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రాంతంలో ఉబ్బినట్టుగా కనబడుతుంది. నొక్కినట్లయితే గట్టిగా రాయి లాగా బిగుసుకుపోయినట్టు ఉంటుంది కండరం. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి.

ఆహార విషయానికి వస్తే సోడియం, పొటాషియం, క్యాల్షియం లాంటి పోషకాలు సక్రమంగా అందకపోవడం ద్వారా, వేసవికాలంలో అయితే డిహైడ్రేషన్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గడం, నరాలలో జరిగే రక్త ప్రసరణలో చాలా మార్పు రావడం, నరాల లోపల భాగం కొవ్వుతో పేరుకుపోవడం లాంటివి కారణాలుగా చెప్పవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సమస్య ఎప్పుడో ఒకసారి ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే పర్వాలేదు కానీ కొందరిలో అయితే కంటిన్యూగా ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది.

అలాంటివారు వైద్యుని సంప్రదించి సలహా తీసుకోవాలి. ఇలాంటి వారిలో రెండు మూడు కిలోమీటర్లు నడిచేవారు. ఒక కిలోమీటర్లు కూడా సరిగ్గా నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు కానీ ఇబ్బంది మాత్రం చెప్పడం కష్టం. మన శరీరంలో చెడు రక్తం మంచి రక్తం అని రెండు రకాల రక్త కణాలు ప్రవహిస్తూ ఉంటాయి. మంచి రక్త కణాలలో సంఖ్యలో మార్పు పెద్దగా సంభవిస్తే ఆ ప్రాంతంలో కండరం పై ప్రభావం పడి బిగుసుకుపోయి గట్టిగా అవుతుంది. దీనికి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు.

మరి ఆహారంగా ఎక్కువగా అరటి పండ్లను ఎంచుకోవాలి. ఇందులో సోడియం, పొటాషియం,కాల్షియం పుష్కలంగా ఉంటుంది. భోజనం తర్వాత రోజు కాకపోయినా రెండు రోజులకొకసారి అయినా అరటిపండు తినడం మంచిది. తరువాత పుచ్చకాయ, బొప్పాయి పండు లో కూడా ఈ ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటి ద్వారా కూడా శరీర పోషణ లభిస్తుంది. ఉదయం సాయంత్రం నడవడం అలవాటు అయితే నరాలు ఫ్రీగా అయ్యి రక్తప్రసరణ బాగా జరిగి నరాలలో ఉండే కొవ్వు కరుగుతుంది దీని ద్వారా సమస్య అనేది దరిచేరదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker