బోర్లా పడుకునే అలవాటు ఉందా..? వెంటనే మానుకోండి, ఎందుకంటే..?
బోర్లా పడుకోవడం వల్ల మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా బోర్లా పడుకున్నప్పుడు మెడ ఏటో ఒకవైపు తిప్పి పడుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో దిండు కారణంగా మెడకు, వీపుకు మధ్య గ్యాప్ ఏర్పడతుంది. దీనివల్ల మెడ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది భుజం నొప్పికి కూడా దారి తీస్తుందని చెబుతున్నారు. బోర్లా పడుకుంటే ఏమవుతుంది, పొట్ట మీద పడుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
వీపు, మెడలో ఒత్తిడి కలగడం వల్ల రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుందట..కానీ నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే బోర్లా పడుకున్నప్పుడు మొహం ఒక వైపుకి పెట్టి పడుకుంటాం. కొన్ని సార్లు అటు ఇటు తిప్పుతూ ఉండటం వల్ల మెడలు నొప్పులు వస్తాయి. ఒక్కోసారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుగా కూడా మారే అవకాశం ఉంది. ఇలా పడుకోవడం వల్ల వెన్నెముక మీద ఇబ్బంది పడుతుంది. మన శరీరం మొత్తం పరుపులోకి దిగబడిపోయినట్టుగా మునిగిపోతుంది. దాని వల్ల వెన్నెముక ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది.
పైగా నిద్ర లేచిన తర్వాత నొప్పులు ఇంకా పెరుగుతాయి.. బోర్లా పడుకున్నపుడు శ్వాస తీసుకోవడానికి మెడ అటు ఇటు తిప్పడం వల్ల మెడ నొప్పి వచ్చేస్తుంది. మొహం మీద ముడతలు కూడా పడొచ్చు..మనం ముఖాన్ని ఒకవైపు మాత్రమే దిండులోకి నొక్కడం వల్ల చర్మం సాగిపోతుంది. దీని వల్ల మొహం మడతలు పడుతుందట..అయితే, పొట్ట మీద పడి బోర్లా నిద్రపోవడం వల్ల గురక, స్లీప్ అప్నియా ప్రమాదాన్ని అయితే తగ్గించవచ్చు.
అలవాటు నుంచి బయటపడటం ఎలా..బోర్లా కాకుండా వెల్లికిలా పడుకోవడానికి మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు… మీ పక్కన పొడవుగా దిండ్లు లేదా బరువైన దుప్పట్లు పెట్టుకోవాలి. మీరు బోర్లా పడుకొని తిరగాలని అనిపించినప్పుడు అవి మిమ్మలని అడ్డుకుంటాయి. ఎంత ప్రయత్నించినా ఆ అలవాటు మానలేకపోతే తల దిండ్లు సన్నని ఉపయోగించండి… దాని వల్ల మెడ మీద తక్కువ ఒత్తిడి పడుతుంది. దిండు లేకుండా పడుకున్న మంచిదే.