ఇలా చేస్తే క్షణాల్లోనే నిద్రపోతారట..! ఏం చెయ్యాలంటే..?
ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన నిద్ర అవసరం. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ప్రశాంతంగా నిద్ర పొవడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్వం రోజుల్లో పగలంతా కష్టపడి అవ్వగానే కడుపునిండా తిని మంచిగా నిద్ర పోయేవారు.. అలా పడుకోగానే వెంటనే నిద్ర వచ్చేది..
కానీ ప్రస్తుతం శరీరానికి ఎక్కువ శ్రమ చేయపోవడం వలన నిద్రలేమి సమస్య చాలా ఎక్కువ ఉంది. రాత్రంతా సరిగా నిద్ర పోకపోవడం వలన ఆ రోజంతా ఏ పని చేయాలన్న బద్దకంగా శరీరం సహకరించకుండా ఉంటుంది. శరీరానికి సరిగా రెస్ట్ లేకపోవడం వలన హార్మోన్స్ బ్యాలెన్స్, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి సుఖంగా నిద్ర పోవడం కోసం హాస్పటల్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు.
అయితే మన వంటింట్లో దొరికి కొన్ని ఆహార చిట్కాలతో సులువుగా నిద్ర పట్టే విధంగా చేసుకోవచ్చు.. అదేమిటంటే ముందుగా ఒక పాత్ర తీసుకొని దానిలో గ్లాసున్నర పాలు పోసి బాగా మరిగించాలి.. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో రెండు స్పూన్ల తేనెను కలిపి భోజనం చేసిన తరువాత అరగంటకు ఈ పాలను తాగటం వలన.. పది నిమిషాలలో ఘనమైన నిద్ర వస్తుంది..
ఎన్ని హాస్పటల్ తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేదు అని అనుకునేవారు ఒక్కసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.. మంచి ఫలితం ఉంటుంది.. పాలు తేనెను కలిపి తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. దీన్ని అన్ని వయసుల వారు కూడా ఉపయోగించవచ్చు .. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఈ చిట్కాను ట్రై చేయవచ్చు. చిన్న పిల్లలు మంచి నిద్ర పోవటం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది.