నిద్రలేమి సమస్యతో ఉన్నవారు ఈ చిట్కా పాటిస్తే నిమిషంలోనే నిద్రలోకి జరుకుంటారు.

నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం హాయిగా ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాటి మూలంగా పెరిగే ఒత్తిడి మనిషిని మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలను కొందరు భరించగలిగినా కొంతమంది మాత్రం తీవ్ర వ్యాకులతకు గురవుతారు. దాంతో వారికి సరిగ్గా నిద్రపట్టదు. నిద్ర సరిగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి.
అయితే నిద్ర పట్టని చాలా మంది మార్కెట్‌లో లభించే చాలా రకాల ఔషధాలను తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే సులభంగా నిద్ర పట్టడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించడం వల్ల సులభంగా ఆరోగ్యమైన నిద్ర పొందుతారు. స్మార్ట్ ఫోన్ వినియోగించడం మానుకోండి.
చాలా మంది ప్రజలు పడుకున్న తర్వాత అరగంట పాటు ఫోన్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రలేమి సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మీరు పడుకునే ముందు ఫోన్ నుంచి దూరంగా ఉంటే చాలా మంచిది. పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి.. రోజూ నిద్రపోయే ముందు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
ఇలా చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత పడుకుంటే వెంటనే నిద్ర పట్టే అవకాశాలున్నాయి. నిజానికి మన ముఖంపై 40 కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలను పంపుతాయి. ముఖం రిలాక్స్‌గా ఉంటే శరీరం కూడా రిలాక్స్‌గా ఉంటుంది. ఆలోచించవద్దు.. పడుకున్న తర్వాత చాలా సార్లు మన మనస్సులో రకరకాల ఆలోచనలు రావడం మొదలవుతాయి. మీరు రోజంతా ఏమి చేసారు, రేపు ఉదయం నిద్రలేవగానే ఏమి చేస్తారని ఆలోచిస్తారు.
ఇలా ఆలోచించడం మానుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శ్వాస వ్యాయామం.. శ్వాస వ్యాయామం చేయడం వల్ల కూడా మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని కారణంగా ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగి.. ఒత్తిడి ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో మీరు సులభంగా నిద్రపోతారు. కాబట్టి నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలాంటి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.