Sleep Divorce: యువ జంటల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్, రోజురోజుకీ పెరుగుతోన్న స్లీప్ డైవర్స్..!

Sleep Divorce: యువ జంటల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్, రోజురోజుకీ పెరుగుతోన్న స్లీప్ డైవర్స్..!
Sleep Divorce: ప్రజలు వారి వారి స్తోమతలను బట్టి స్థానిక పర్యాటక స్థలాలు మొదలు విదేశీ టూరిస్టు ప్రదేశాల వరకూ వివిధ రకాల ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అయితే, ఇలా రోజుల తరబడి టూర్లల్లో పాల్గొనే యువ జంటల్లో ఇటీవల కాలంలో ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే భార్యాభర్తలు లేదా భాగస్వాములు వేర్వేరు గదుల్లో లేదా వేర్వేరుగా నిద్రపోవడం ఇటీవల కాలంలో పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read: ఈ సమస్యలున్నవారు సోంపు అస్సలు తీసుకోకూడదు.
2024 లో అమెరికా అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అధ్యయనం నిర్వహించింది. మూడోవంతు జంటల్లో రోజూ లేదా అప్పుడప్పుడూ భాగస్వాములకు దూరంగా వేరే గదిలో నిద్రిస్తున్నారని ఆ సర్వే తెలిపింది. ప్రశాంతంగా నిద్రపోవడం కోసం స్లీప్ డైవోర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. నిద్రపోయే సమయంలో భాగస్వాముల్లో ఎవరికైనా ఒకరికి గురక పెట్టే అలవాటు ఉంటే మరొకరికి ఇబ్బంది అవుతుంది.

నిద్రలో నడిచే అలవాటు, తరచుగా వాష్ రూమ్ కు వెళ్లడం, అలారం సౌండ్, మొబైల్ వాడడం వంటి వాటితో ఇబ్బంది పడే వారంతా స్లీప్ డైవోర్స్ ను కోరుకుంటున్నారు. కనీసం ఏడున్నర నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం అవసరం. సరైన నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన నిద్ర కోసం పార్ట్‌నర్ లేకుండానే నిద్రను కోరుకుంటున్నారు.
Also Read: ఒక ఆ ముద్దు 80 మిలియన్ బ్యాక్టీరియాను బదిలీ చేస్తుంది.
సరైన నిద్ర లేకపోతే దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్ర ఉంటేనే దంపతుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయని, విడాకులు తీసుకునే జంటల సంఖ్య తగ్గుతుందని ది ఒహాయో స్టేట్ యూనివర్శిటీ అధ్యయనం తెలుపుతుంది. ఇందుకు స్లీప్ డైవోర్స్ పద్దతిని పాటించాలని కోరుతోంది.