మీ ఫోన్ లో రేడియేషన్ ఎంతో ఉందొ చెక్ చేసుకోండి, డేంజర్‌లో ఆరోగ్యం.
సెల్‌ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. సెల్‌ఫోన్ రేడియేషన్ ఆ స్థాయిలో లేదన్నది చాలామంది అభిప్రాయం. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే, ఫోన్ రేడియేషన్ ఉంటున్నదని వారి వాదన. ఈ వివాదం తేలనంత వరకూ, వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదు. స్పీకర్ ఫోన్‌లో మాట్లాడటం, ఫోన్ నిరంతరం జేబులో కాకుండా పక్కన ఉంచుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూరంగా పెట్టడం లాంటి జాగ్రత్తలు పాటించమంటున్నారు విశ్లేషకులు.
అయితే ఏ ఫోన్ రేడియేషన్ ఎంత ఉంటుంది అనే విషయంలో ఎవరికి పెద్దగా అవగాహన ఉండదనే చెప్పాలి. రేడియేషన్ అంటే ఏంటో కూడా తెలియనివారు ఉంటారనడంలో సందేహం అక్కర్లేదు. రేడియేషన్ లేదా SAR వాల్యూ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చాక ముందుగా చెక్ చేయాల్సింది రేడియేషన్ లెవల్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అప్పుడే ఆ ఫోన్ కొనాలా? వద్దా? అని డిసైడ్ చేసుకోవాలి. కొన్ని స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు తమ యూజర్ మాన్యువల్ ల్లోనే SAR రేటింగ్ ఎంతో ప్రస్తావిస్తాయి. కొన్న స్మార్ట్ ఫోన్ బాక్సులోనే ఇది ఉంటుంది.
అంతేకాదు.. స్మార్ట్ ఫోన్ అధికారిక వెబ్ సైట్లో కూడా తమ ప్రొడక్టుకు సంబంధించి SAR వాల్యూ ఎంత ఉందో రివీల్ చేస్తాయి కూడా. సాధారణంగా ప్రతి ఫోన్ లో రేడియో ఫ్రిక్వెన్సీ ట్రాన్స్ మిటింగ్ డివైజ్ ఉంటుంది. దీని ద్వారా కొత్త స్థాయిలో రేడియేషన్ బయటకు రిలీజ్ అవుతుంది. ఈ రేడియేషన్ కారణంగా ఆ ఫోన్ వాడేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాప కింద నీరులా ఆ రేడియేషన్ మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతిస్తూ వస్తుంది. రేడియేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్టే. వృద్ధాప్యం.. నిత్యం ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల హాని కలుగుతుంది.
రేడియేషన్ కారణంగా చర్మంపై టానింగ్ బెడ్‌లను సృష్టిస్తాయి. కణజాలాల లొపలి పొరకు హాని కలిగిస్తుంది. రేడిషన్ కారణంగా వృద్ధాప్యం త్వరగా రావడమే కాకుండా దుష్ప్రభావాలకు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. చర్మ సున్నితత్వం.. మన వయసులో, చర్మ సున్నితత్వం అనేది ఎంతో ముఖ్యం. చర్మాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే విధంగా, శాశ్వతంగా నష్టాన్ని కలిగిస్తుంది. రేడియేషన్ కారణంగా చర్మ సున్నితత్వం అనేది కోల్పోతుంది. రేడియేషన్ తో చర్మం ఎర్రబడటం, పొడిబారుతుండటం జరుగుతుంది. అయితే చర్మం గాలిలో ఉండే హానికరమైన కణాలకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.