Health

Smoking Tea: టీ తాగుతూ సిగరెట్‌ తాగుతున్నారా.? ఈ విషయం తెలిస్తే గుండెలో దడ రావడం ఖాయం.

Smoking Tea: టీ తాగుతూ సిగరెట్‌ తాగుతున్నారా.? ఈ విషయం తెలిస్తే గుండెలో దడ రావడం ఖాయం.

Smoking Tea: చాలామంది సిగరెట్ తాగుతూ టీ కూడా తాగుతూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి తాగడం వల్ల కలిగే ప్రమాదాలు గురించి చాలా మందికి తెలియదు. కానీ, ఈ అలవాటు అంత సురక్షితమైనది కాదు. అయితే టీ, సిగరెట్‌ రెండింటిని ఒకసారి తాగుతుండటం భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. టీ, సిగరెట్లను కలిపి తాగడం వల్ల గుండె జబ్బులతో పాటు క్యాన్సన్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. టీతో సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరమైన ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం.. ధూమపానం, మద్యపానం చేసేవారిలో క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. టీ, సిగరెట్‌ రెండింటిని కలిపి తాగడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 30 శాతం ఉంటుందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ నివేదిక వెల్లడించింది.

Also Read: కోవిడ్‌ సమయంలో స్టెరాయిడ్స్‌ తీసుకున్నారా..?

దీని ప్రకారం.. వేడి టీ జీర్ణ కణాలను దెబ్బతీస్తుందని, టీ-సిగరెట్‌ను కలిపి తాగడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది. ఇక తాగే టీలో కెఫీన్‌ ఉంటుందని, దీని కారణంగా కడుపులో జీర్ణక్రియకు సహాయపడే ప్రత్యేక యాసిడ్ ఉత్పత్తి అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్ లేదా బీడీలలో నికోటిన్ ఉంటుందని, టీలో కెఫీన్‌ ఉంటుంది. ఈ రెండింటి వల్ల రక్తపోటును పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయంటున్నారు. అంతేకాదు రక్తనాళాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందట. అందుకే అకస్మాత్తుగా గుండెపోటు రావడం, ఇతర గుండె సంబంధిత వ్యాధులు రావడం ప్రారంభమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

అలాగే టీ, సిగరెట్‌ వల్ల మలబద్దకం, అజీర్తి, అల్సర్‌ వంటి సమస్యలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. ఒక సిగరెట్‌లో దాదాపు 6-12 mg నికోటిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ తాగేవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తి కంటే 2-3 రెట్లు ఎక్కువ. సిగరెట్‌లలో ఉండే నికోటిన్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల సంకోచానికి కారణమవుతుంది. దీని కారణంగా గుండెకు స్వచ్ఛమైన రక్తం సరఫరా కాదు. అలాగే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. టీలో ఉండే పాలీఫెనాల్స్ అనే సహజ మూలకాలు సాధారణంగా గుండె ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. కానీ టీతో కలిపి సిగరెట్‌ తాగడం మంచి లక్షణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Also Read: ఈ సమస్యలున్నవారు కొబ్బరి నీళ్లు తగాకపోవడమే మంచిది.

టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల కలిగే నష్టాలు.. టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం పెరుగుతాయని ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం కూడా వెల్లడించింది. టీలో ఉండే టాక్సిన్స్ సిగరెట్ పొగలో కలిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అందువల్ల, టీతో పాటు సిగరెట్ తాగకూడదు. గుండె, మెదడు స్ట్రోక్ ప్రమాదం, చేతులు, కాళ్ళలో పుండు (గ్యాంగ్రీన్), జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఊపిరితిత్తులలో సంకోచం, కడుపు సమస్యలు, సంతానలేమి సమస్య.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker