Snakes: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటె చాలు, మిమ్మల్ని ఏ పాము ఏం చెయ్యలేదు, ఎందుకంటే..?

Snakes: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటె చాలు, మిమ్మల్ని ఏ పాము ఏం చెయ్యలేదు, ఎందుకంటే..?
Snakes: పాములు కొన్ని వాసనలకు, శబ్దాలకు, వాటి సహజ శత్రువులకు భయపడతాయని మీకు తెలుసా? ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మీ ఇంటిని, పరిసరాలను పాముల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. వర్షాకాలంలో పాముకాట్ల నుంచి తప్పించుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని “అడవి తులసి” అని పిలుస్తారు. ఇది సాధారణ తులసి మొక్కను పోలి ఉంటుంది కానీ దీని వాసన మరింత బలంగా ఉంటుంది.
Also Read: ఈ ధనియాల నీరు రోజు తాగితే చాలు.
ఈ వాసనే పాములు, తేళ్లు, దోమలు, కీటకాలు వంటి జీవులను దూరంగా ఉంచుతుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఇప్పుడు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఈ మొక్కను ఇళ్ల ముందు, తోటల్లో లేదా కిటికీ దగ్గర పెంచడం మొదలుపెట్టారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, అడవి తులసికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకులు తలనొప్పి, చర్మ వ్యాధులు, దురద వంటి సమస్యలకు ఉపయోగపడతాయి.

Also Read: ఈ మొక్కతో తింటే చాలు, స్త్రీ, పురుషులిద్దరికీ వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
కొన్ని గ్రామాల్లో పాముల కాటు వచ్చినప్పుడు కూడా దీని ఆకుల రసాన్ని ఉపయోగించే పద్ధతులు ఉన్నాయి. నిపుణుడు లఖన్ సైని చెబుతున్నదాని ప్రకారం, ఈ మొక్క దగ్గర పాము వెళ్తే, దాని వాసనతో వెంటనే దూరంగా పారిపోతుంది. అంతే కాకుండా, దీని ఆకుల రసం నెయ్యితో మరియు నల్ల మిరియాలతో కలిపి గాయాలపై పూస్తే, విషం ప్రభావం తగ్గుతుందని ఆయుర్వేదంలో చెబుతారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అడవి తులసి వేర్లు లేదా ఆకులు ఎవరి దగ్గర ఉంటే, పాము వారి వైపుకి రావడం కష్టమని పాతకాలపు నమ్మకం.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే అపెండిక్స్ క్యాన్సర్ ఉన్నట్లే..!
అలాగే దీని ఆకుల రసాన్ని నీటిలో కలిపితే, నీటిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి. అందువల్ల గ్రామాల్లో బావుల దగ్గర కూడా ఈ మొక్కను నాటుతారు. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే, ఇంటి బయట ద్వారం దగ్గర లేదా తోట చుట్టూ 2–3 అడవి తులసి మొక్కలు నాటడం చాలా ప్రయోజనకరం. ఇది పాములను మాత్రమే కాకుండా ఇతర హానికర కీటకాలను కూడా దూరంగా ఉంచుతుంది.
Also Read: నోటి పూతే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా..?
అంతేకాక, దీని ఆకుల సువాసన వాతావరణాన్ని శుభ్రంగా, సానుకూలంగా ఉంచుతుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ చిన్న మొక్క, ఆరోగ్య పరిరక్షణకే కాదు ఇంటి భద్రతకూ సహాయపడుతుంది. కాబట్టి వర్షాకాలంలో మీ ఇల్లు పాముల నుండి రక్షించుకోవాలంటే, అడవి తులసిని పెంచడం ఒక సహజమైన, సురక్షితమైన పరిష్కారం అవుతుంది.