‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో చూశారా..?
అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో 2015లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం గుర్తుందా? ఎందుకు గుర్తుండదులే ఆ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ మరి. అయితే అందులో బన్నీ అన్న కూతురిగా ఓ బుజ్జి పాప నటించింది కదా. ఆ పాప పేరు వర్ణిక. అందులో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది వర్ణిక. అయితే ఈ బ్యూటీ పేరు వర్ణిక. తొమ్మిదేళ్ల కిందట వచ్చిన సన్నాఫ్ సత్యమూరి సినిమా గుర్తుందిగా.. అందులో వెన్నెల కిషోర్ కూతురుగా ఓ పాప నటించింది.
ఆ పాపే.. మీరు చూసిన వీడియోలో ఉన్న పాప. అల్లు అర్జున్‌తో ఈ పాప కనిపించే ప్రతీ సీన్ చాలా బావుంటుంది. ఈ సినిమాలో వర్ణికకు పెద్దగా డైలాగ్స్ ఏమి ఉండవు కానీ.. తన క్యూట్ లుక్స్‌తో ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. కాగా తొమ్మిదేళ్ల తర్వాత ఇలా పాపను చూసేసరికి షాకింగ్‌గా అనిపిస్తుంది. అందులోనూ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలోని సూసేకి పాటకు రీల్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక తొమ్మిదేళ్ల కిందట కిందట వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. కమర్షియల్ లాభాల సంగతి కాసేపు పక్కన పెడితే.. మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ నెక్స్ట్ లెవల్ అసలు.దానికి తోడు అల్లు అర్జున్ టెర్రిఫిక్ పర్‌ఫ్మెన్స్, పాటలు, ఫైట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సినీ లవర్స్‌కు ఒక మంచి ప్యాకేజీలా అనిపిస్తుంటుంది.
ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం. అంతలా నచ్చేస్తుంది. ఎస్.రాధాకృష్ణ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.40 కోట్ల బడ్జెట్ కాగా.. ఫైనల్ రన్‌లో రూ.90.5 కోట్ల వరకు గ్రాస్‌ను రాబట్టి బంపర్ హిట్టుగా నిలిచింది.