News

మాల్దీవుల్లో ఒక చోట చేరిన స్టార్ హీరోలు. వీళ్ళ మీటింగ్ కి కారణమేంటో తెలిస్తే..?

స్టార్ హీరోలంతా నిమిషం తీరిక లేకుండా ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు. అయినా సరే వీరందరూ కలిసి ఒకే చోట చేరారు. ఇప్పుడు ఈ ఫోటోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సాధారణంగా ఒకరిద్దరు హీరోస్ కలిసి కనిపిస్తేనే.. మ్యూచువల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఇంత మంది హీరోలు ఒకే చోట కనిపించడంతో.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది.

ఇంత బిజీ బిజీగా ఉన్న వీరంతా కలవడం వెనుక రీజన్ ఏంటి? అసలు వారికి కలిసి పార్టీ చేసుకునేంత టైం కూడా ఉందా ? ఓ వైపు చూస్తే సినిమా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయ్ కదా? ఏదైనా అవార్డు ఫంక్షన్ ఉంటేనే ఒకరొస్తే ఒకరు రారు. అలాంటిది ఒకేసారి వీరంతా ఎందుకు మీట్ అయ్యారు ? ఇలాంటి ప్రశ్నలతో సోషల్ మీడియా కామెంట్ బాక్స్ లు నిండిపోతున్నాయి. అయితే టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు ముగ్గురూ కలిసి ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అగ్ర కథానాయకులు ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో ఆ హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు ముగ్గురూ ఎవరు ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లో పాల్గొన్నారు? పార్టీ ఎక్కడ జరిగింది? అన్న వాటిపై చర్చ జరుగుతోంది. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు మరి కొందరితో ఓ హోటల్‌లో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉండటం ఆ ఫోటోలో కనిపిస్తుంది. అయితే, మాల్దీవులు వేదికగా ఓ వ్యాపార వేత్త తన పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ట్రీట్‌కు వీరంతా హాజరయ్యారని సమాచారం.

ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్‌లో చిరంజీవి, కుబేర, కూలీ సినిమాల్లో నాగార్జున, రాజమౌళి దర్శకత్వంలోని చిత్రంలో మహేశ్ బాబు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. షూటింగ్స్‌కు కాస్త విరామం ఇచ్చి వీరు సరదాగా మాల్దీవుల్లో గడిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker