ఈ నూనె అలా చేసి వాడితే పెద్ద పేగు మొత్తం శుభ్రం అవుతుంది.
కొబ్బరి నూనెను సాధారణంగా వంటలో ప్రత్యేకంగా వేయించే సమయంలో ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెను వంటలో ఎక్కువగా ఉపయోగించే బృందాల్లో, శుద్ధికాని నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెను సాధారణంగా పలు దక్షిణ ఆసియా కూరల్లో సువాసన కోసం ఉపయోగిస్తారు. ఇతర వంట నూనెలకు సంబంధించి, దీనిని వేడిచేసినప్పుడు, కనిష్ఠ హానికరమైన పరిణామాలను రూపొందిస్తుంది. అయితే జుట్టు పెరుగుదల నుండి బరువు తగ్గడం వరకు కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అనేక ఔషదగుణాలు ఉన్నాయి.
ముఖ్యంగా జీర్ణ ప్రక్రియ సవ్యంగా ఉండేలా చేయటంలో కొబ్బరి నూనె ఎంతగానో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి, మలాన్ని మృదువుగా చేయడానికి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె పేగులకు లూబ్రికేట్ లా తోడ్పడుతుంది. తద్వారా పేగుల్లో మలం కదలడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. లారిక్ ఆమ్లం, కాప్రిలిక్ ఆమ్లం, కాప్రిక్ ఆమ్లంతోపాటుగా యాంటీ ఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటివైరల్ మరియు యాంటిమైక్రోబియాల్ లక్షణాలను ఇది కలిగి ఉంటుంది.
శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వివిధ వ్యాధులకు కారణమయ్యే వైరస్లు మరియు బ్యాక్టీరియాలను పోగొట్టుకోవడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థకు కొబ్బరి నూనె చాలా మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అజీర్ణం, చికాకుపెట్టే పేగు వ్యాధి, రక్తస్రావ నివారిణి మరియు మలబద్ధకం వంటి వివిధ కడుపు మరియు జీర్ణశయాంతర సమస్యలను కూడా నిరోధిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది శరీరంలోని అదనపు వ్యర్థాలను తొలగిస్తుంది.
మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఒకటి లేదా రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా కొబ్బరి నూనెను కాఫీ లేదా ఒక గ్లాసు జ్యూస్‌లో కలుపుకుని తీసుకోవచ్చు. జీర్ణ ప్రక్రియలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటి ఇతర పోషకాల యొక్క శోషణకు కొబ్బరి నూనె సహాయపడుతుంది. జీర్ణ సమస్యల వలన బాధపడుతుంటే, ఆహారంలో కొబ్బరి నూనె తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.