Health

పేగులు ఆరోగ్యంగా ఉంటేనే ఈ రోగాలు దూరం. లేదంటే ఆరోగ్యం అంటే సంగతులు.

శరీరంలో ఇంత ముఖ్యమైన పాత్రను పేగులు నిర్వర్తిస్తున్నాయి కాబట్టే.. వీటికి మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర ఉందని చెబుతున్నారు. నిజానికి తినే ఆహార పదార్థాలు, లైఫ్‌ స్టైల్‌ వల్ల శరీరంలో ఎక్కువగా ప్రభావితం అయ్యేవి పేగులే. కానీ వీటిని జాగ్రత్తగా చూసుకోవడంపై ఎక్కువ మంది అశ్రద్ధ వహిస్తారు. అందుకే పేగుల ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పండ్లు, కూరగాయలు, సమపాళ్లలో తీసుకున్న ధాన్యాలు, శెనగలు లాంటి వాటిలో ఉన్న ఫైబర్ పేగుల కదలికలను సులభతరం చేస్తుంది.

ఇది మలబద్ధకాన్ని నివారించి పేగులలో ఉన్న మంచి బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని అందిస్తుంది. పెరుగు, పులిసిపోయిన అన్నం, ఇడ్లీ లాంటి ఆహారాలు ప్రోబయాటిక్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరం చల్లబడుతుంది. తగినంత నీరు తాగకపోతే జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ద్వారా పేగులు తేమగా ఉండటమే కాకుండా విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి.

తేలికపాటి వ్యాయామం నిత్యం చేయడం పేగుల కదలికను చురుకుగా ఉంచుతుంది. ఇది శరీర శ్రామికతను పెంచి మలబద్ధకం లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఎంత తక్కువగా అయినా శరీరం కదలడం అవసరం. తగినంత నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్ల స్రావం అవస్థలు పడుతుంది. ఇది పేగుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర పోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాగా చక్కెర కలిగిన డబ్బాలో నిల్వ చేసే ఆహారాల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇవి పేగులలో మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి.

అలాంటి ఆహారాలను తగ్గించడమే ఉత్తమం. డాక్టర్ సూచన లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పేగులలో ఉన్న మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. ఇది జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఏ మందులు అయినా సరే వైద్యుడి సలహాతోనే తీసుకోవాలి. ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు అన్నీ సమంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. పేగులు కూడా సమతుల్యంగా పనిచేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker