Health

Strong Bones : ఈ ఆహారపదార్థాలు తింటే మీ ఎముకలు ఉక్కులా బలంగా మారుతాయి.

Strong Bones : ఈ ఆహారపదార్థాలు తింటే మీ ఎముకలు ఉక్కులా బలంగా మారుతాయి.

Strong Bones : నేటికాలంలో ఆరోగ్యంగా ఉండడమంటే నిజంగా సవాలే. అందులోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు ఎముకలు దృఢంగా ఉండేందుకు ఆహారంలో రకరకాల మార్పులు చేసుకోవడం చాలా అవసరం. లేదంటే ఎముకల ఆరోగ్యం, దృఢత్వం దెబ్బతింటుంది. కాబట్టి మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే శరీరం స్పీడుగా పని చేయాలంటే ముందుగా హెల్ప్ చేసేవి ఎముకలే.

Also Read:మీ లివర్ ప్రమాదంలో ఉందని కనిపించే సంకేతాలు ఇవే.

బోన్స్ బలంగా, దృఢంగా ఉంటేనే శరీరం కూడా పనికి సహకరిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే.. క్యాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, ఫాస్పరస్ అనేవి చాలా అవసరం. ఇవి శరీరంలో సరైన మోతాదులో ఉంటేనే ఎముకలు హెల్దీగా ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో పాల ఉత్పత్తులు తీసుకోవాలి. వీటిల్లో తగినంత మోతాదులో క్యాల్షియం అందుతుంది. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ప్రతి రోజూ ఒక అరటి పండు తిన్నా ఎముకలు దృఢంగా ఉంటాయి.

పాలకూర తిన్నా కూడా ఎముకలు బలంగా, దృఢంగానే ఉంటాయి. ఇవి దంతాల, ఎముకల ఆరోగ్యానికి సహాయ పడతాయి. ఇందులో ఉండే పోషకాలు ఎముకలు బలంగా ఉండేందుకు సహాయ పడతాయి. ప్రతి రోజూ నట్స్ తిన్నా కూడా ఎముకలు బలంగా మారతాయి. త్వరగా ఎముకలు విరిగిపోకుండా, నొప్పులు రాకుండా ఉంటాయి. నట్స్‌లో మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వయసు పెరిగే కొద్దీ కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి.

Also Read: ఒక నెల రోజులు ఖాళీకడుపుతో ఈ పొడిని కొంచం నీటిలో వేసుకొని తాగితే చాలు.

అదే విధంగా విటమిన్ డి ఉండే ఆహారాలు, ఆరెంజె జ్యూస్, చియా సీడ్స్, టోఫు, బ్రకోలీ, నువ్వులు వంటివి తీసుకున్న తగిన మోతాదులో పోషకాలు అంది ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉక్కులా మారతాయి. చిన్పప్పటి నుంచి పిల్లలకు ఇవ్వడం కూడా మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker