పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు, వధువు ఎవరో తెలిస్తే..?
తాజాగా టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు సంతోష్ సైతం సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో తన వైఫ్‌తో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో సుబ్బరాజు దంపతులు పెళ్లిబట్టల్లో కనిపించారు. కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుబ్బరాజు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సుబ్బరాజు సతీమణి గురించి వివరాలు ఇంకా తెలియరాలేదు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర పర్సనల్ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన అతను అనుకోకుండా డైరెక్టర్ దగ్గనే పర్సనల్ అసిస్టెంట్ గా చేరాడు.
మొదట ‘ఖడ్గం’ సినిమాలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఖడ్గం తర్వాత ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, స్టాలిన్, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, ఖలేజా, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్, బిందాస్, గోల్కొండ హైస్కూల్, దూకుడు, పంజా, బిజినెస్ మ్యాన్, ఎవడు, శ్రీమంతుడు, బాహుబలి 2, దువ్వాడ జగన్నాథం, గీతా గోవిందం, ఎఫ్ 2, మజిలీ, గద్దల కొండ గణేష్, అఖండ, సర్కారు వారి పాట, వాల్తేరు వీరయ్య, శాకుంతలం, బ్రో తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.
తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు సుబ్బరాజు. ఎక్కువగా విలన్ వేషాలు వేసినప్పటికీ కొన్ని సినిమాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు సుమారు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడీ స్టార్ యాక్టర్.