సుడిగాలి సుదీర్ ఎంగేజ్మెంట్. అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే..?
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు చాలామంది బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయాడు కాబట్టి సుధీర్‌ను చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా కూడా తీసుకుంటారు. తాజాగా ఓ షోలో సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది.
అయితే సుడిగాలి సుధీర్ ఎప్పుడు డెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూసే అభిమానులకు ఇది గుడ్ న్యూస్. సుడిగాలి సుదీర్ తో ఎంగేజ్మెంట్ జరిగిన అమ్మాయి విజయవాడ కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయిగా చెబుతున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని తెలుస్తోంది. అమ్మాయి తండ్రి కూడా పెద్ద వ్యాపారవేత్తట.
అయితే ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి డాక్టర్ అని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఏమైనా వచ్చే 2023లో తప్పనిసరిగా సుధీర్ పెళ్లి చేసుకునేది ఖాయమని, ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
సుధీర్ ఏది అడిగినా సినిమా తర్వాతే అన్నారట, ప్రస్తుతం సినిమా అయిపోయింది సూపర్ హిట్ కొట్టింది. ఈ శుభ సందర్భంలో కుటుంబ సభ్యులు ఒత్తిడి పెట్టడంతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సుధీర్ ఈ విషయంపై తాను స్వయంగా ప్రకటిస్తే గాని అసలు విషయం బయటకు రాదు.