చక్కెర అస్సలు తినకపోతే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా..?
మీరు చక్కెర తినడం మానేసినప్పుడు, మీ శరీరం నెమ్మదిగా ప్రభావితమవుతుంది. మీరు షుగర్ మానేసిన తర్వాత మీరు ఆరోగ్యంగా ఉన్నా లేదా అనారోగ్యంతో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. చక్కెర మీ శరీరంలో గ్లూకోజ్‌కు మంచి మూలం. అయితే మన దేశంలో రోజు రోజకు షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే డయాబెటీస్ పేషెంట్లు తీపి, చక్కెర పదార్థాలను తక్కువగా తినాలని డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఈ వ్యాధిని నివారించాలని చాలా మంది చక్కెరను మొత్తమే తినడం మానేస్తుంటారు.
ఇది మంచిదే.. కానీ చక్కెరను పూర్తిగా తినకపోవడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెరలోని రకాలు.. సాధారణంగా చక్కెరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సహజ చక్కెర. రెండోది ప్రాసెస్ చేయబడ్డ చక్కెర, కొబ్బరి, పైనాపిల్, మామిడి, లీచి వంటి పండ్ల ద్వారా మనకు సహజ చక్కెర లభిస్తుంది. అయితే ప్రాసెస్ చేయబడ్డ చక్కెరను బీట్ రూట్, చెరుకు నుంచి తయారు చేస్తారు. అయితే చక్కెరను మోతాదులో తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ పూర్తిగా వదులుకుంటేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
చెరుకు, బీట్ రూట్ నుంచి తయారుచేసిన ప్రాసెస్ చేయబడ్డ సుక్రోజ్ లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో పోషకాలుండవు. కానీ విటమిన్లు, ఖనిజాలు మాత్రం సహజ చక్కెరలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. తీపి పదార్థాలు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. ఈ అలవాటును పూర్తిగా వదిలేయడం అంత సులువు కాదు. అందులోనూ పూర్తిగా చక్కెరను వదిలేయడం కూడా పాణానికి మంచిది కాదు. ప్రాసెస్ చేయబడిన చక్కెరకు బదులుగా సహజ చక్కెరలను తీసుకోండి. పలు పరిశోధనల ప్రకారం.. అకస్మత్తుగా చక్కెరను తినడం మాసేసిన వాళ్ల శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయట. ముఖ్యంగా వీళ్ల శరీరం చాలా త్వరగా అలసిపోతుందని వెల్లడైంది.
అలాగే ఎప్పుడూ తలనొప్పితో ఇబ్బంది పడతారట. చిరాకు కూడా కలుగుతుందట. సహజ చక్కెరను తీసుకోవాలి.. సహజ చక్కెరను కూడా తీసుకోకుండా మీ శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ఇదే మీ శరీరానికి శక్తినిచ్చే వనరు. అందుకే దీన్ని తీసుకోవడం మానేస్తే.. మీ శరీరం ఊరికే అలిసిపోతుంది. మీరు చక్కెరను తీసుకున్నప్పుడే మీ శరీరం నుంచి అదనపు ఇన్సులిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తీసుకోకపోయినా.. సహజ చక్కెరలు లభించే పండ్లను మాత్రం రోజూ తినండి. వీటివల్లే మీ శరీరం తిరిగి శక్తివంతంగా తయారవుతుంది.