మధుమేహులు ఖచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే.
మధుమేహంతో బాధపడుతున్నవారికి పండ్లు సురక్షితమైనవి కావు అనే భావన సరైనదికాదు. వివిధ రకాల పండ్లులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ నిక్షేపాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతాయి. అయితే అయితే మధుమేహులు ఏఏ పండ్లను తినాలి అనేదానిపై ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఏవి తినాలో, ఏవి తినకూడదో అన్న సంశయంలో ఉంటున్నారు.
డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తినాల్సిన పండ్ల జాబితాలో అంజీర్, దానిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్, పుచ్చకాయలకు చోటున్నది. నేరేడుపండ్లు.. వీటిని తినడం ద్వారా షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చునని పలు అధ్యయనాల్లో తేలింది. వీటి గింజలను పౌడర్ చేసుకుని తీసుకోవడం వల్ల కూడా చక్కెర అదుపులో ఉంటుంది. జామపండ్లు.. విటమిన్ ఏ, సీ తో పాటు ఫైబర్ ఎక్కువగా లభించే జామపండ్లు డయాబెటీస్ రోగులకు చాలా మంచివి.
అంజీర్.. ఫైబర్ ఎక్కువగా ఉండే అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తాయి. నిత్యం పాలలో నానబెట్టి అంజీర్ తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఆపిల్స్.. వీటిని తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. మధుమేహులు నిర్భయంగా ఆపిల్స్ తినొచ్చు. ద్రాక్షపండ్లు.. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ద్రాక్షలు ముందు వరసలో ఉంటాయి. శరీరంలోని కొవ్వు శాతం కూడా తగ్గుతుంది. దానిమ్మపండు.. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
వీటిలో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉండి ఆరోగ్యాన్నిస్తాయి. స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెర్రీలు తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండి నెమ్మదిగా గ్లూకోజ్‌గా రక్త ప్రవాహంలోకి విడుదలవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది పుచ్చకాయ.. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. అయితే, వీటిలో ఉండే పొటాషియం మూత్రపిండాల పనితీరుని మెరుగు పరుస్తుంది.
అందుకని మధుమేహులు ఈ పండుని తినవచ్చును. విటమిన్ సీ లభించే పండ్లు ఏవైనా డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచివి అని గుర్తుంచుకోవాలి. అలాగే, చెర్రీలు, బొప్పాయి, బ్లూబెర్రీలు తినడం చాలా మంచిది. పండ్లను ఆస్వాదించేందుకు చిట్కాలు.. ఎల్లప్పుడూ తాజా, సీజనల్ పండ్లను తినాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినాలి. భోజనం చేసిన తర్వాత పండ్లను తినకూడదు. కొన్ని పండ్లను దాల్చిన చెక్కతో కలిపి తినాలి. పండ్ల రసాలు తాగకుండా చూసుకోవాలి. పచ్చి పండ్ల ఎల్లప్పుడూ తినేలా చూసుకోవాలి.