షుగర్ పేషెంట్లు బెల్లం తినొచ్చా, వైద్యలు ఏం చెప్పారంటే..?
బెల్లంలో అధిక ఔషధ విలువలు ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ బీపీ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే బెల్లంలో సుమారు 65 నుంచి 85 శాతం సుక్రోజ్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు బెల్లాన్ని పూర్తిగా మానేయడం మంచిది. డయాబెటిక్ ఐడియల్ డైట్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఉంటాయి. కానీ బెల్లంలో గ్లైసెమిక్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
దీంతో బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే డయాబెటీస్ పేషెంట్లకి స్వీట్లు విషంతో సమానం. అయితే వీరు కోరికలని అదుపుచేసుకోలేక ప్రత్యామ్నాయ ఎంపికల కోసం వెతుకుతారు. పండుగ సీజన్‌లో చక్కెరతో చేసిన స్వీట్లు కాకుండా బెల్లంతో చేసిన స్వీట్లని తినడానికి మొగ్గుచూపుతారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని పెంచదని నమ్ముతారు.
కానీ వైద్య నిపుణులు మరొకలా చెబుతున్నారు. బెల్లం కూడా డయాబెటీస్ పేషెంట్లకి మంచిది కాదని అంటున్నారు. బెల్లం వాడటం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా బెల్లం మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక కాదు. మధుమేహం ఉన్నవారు సాధారణంగా తీపిని తినకుండా ఉండాలి. చక్కెర ప్రత్యామ్నాయాలతో చేసిన డెజర్ట్‌లను కూడా తినకూడదు. బెల్లం, చక్కెర రెండింటిని పోలిస్తే స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది.
చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యంగా ఉంటాయని నమ్ముతారు. కానీ ఇది తప్పు. బెల్లంలో సుక్రోజ్ ఉంటుంది. మన శరీరం దీనిని గ్రహించినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంటే బెల్లం కూడా ఇతర చక్కెరల వలె ప్రమాదకరం. మధుమేహం లేని వారు చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చు.
ఇది వారికి తెలివైన నిర్ణయం. కానీ వైద్య నిపుణులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని సూచిస్తారు. అందుకే బెల్లం తినడానికి వీల్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యంతో ఉంటే, బ్లడ్ షుగర్‌తో ఎటువంటి సమస్య లేనట్లయితే తెల్ల చక్కెర స్థానంలో బెల్లం ఉపయోగించవచ్చు. కానీ డయాబెటిస్ ఉన్నట్లయితే బెల్లం పూర్తిగా మానేయాలి.