ఆయన్ని తలచుకొని ఎమోషనల్ అయిన సురేఖావాణి. అయన మరణం నేపథ్యంలో..!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటి కపుడు తాజా ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే రిశ్రమకు వచ్చిన కొత్తల్లో సురేఖావాణి యాంకర్ గా చేశారు. ఆమె మా మ్యూజిక్ లో పని చేశారు. ఆ సమయంలో ప్రోగ్రాం డైరెక్టర్ అయిన సురేష్ తేజతో పరిచయమైంది.
అది ప్రేమకు దారి తీసింది. అనంతరం వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. పేరు సుప్రీత. సురేఖావాణి భర్త 2019లో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ తేజ అకాల మరణం పొందారు. భర్త మరణం నేపథ్యంలో సురేఖా వాణి కొన్నాళ్ళు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఆ వెంటనే లాక్ డౌన్ సంభవించింది. దీంతో సురేఖావాణికి పరిశ్రమతో గ్యాప్ వచ్చింది. ఈ మధ్య ఆమెకు ఆఫర్స్ పెద్దగా రావడం లేదు. అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.
సురేఖావాణి ఇటీవల పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసిందని నేరుగా చెప్పింది. ఒకింత అసహనం వెళ్లగక్కారు. అయితే సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తనలోని తెలియని కోణాన్ని పరిచయం చేస్తున్నారు. సురేఖావాణి హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కూతురు సుప్రీతతో పాటు సురేఖావాణి డాన్స్ వీడియోలు చేస్తుంటారు.
ఈ తల్లీ కూతుళ్లు స్నేహితులు మాదిరి మెలుగుతారు. ఆ మధ్య కూతురికి స్వయంగా మద్యం తాగిస్తూ కనిపించింది. ఈ ఫోటో విమర్శల పాలైంది. సురేఖావాణి తన కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలని అనుకుంటుంది. ఆల్రెడీ సుప్రీత ఫ్యాన్స్ ని రాబట్టారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ఛాట్ చేస్తుంటారు. సుప్రీత బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తున్నారు.
మరి హీరోయిన్ కావాలన్న ఆమె కలలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి. సుప్రీత హీరోయిన్ మెటీరియల్. బ్రేక్ వస్తే స్టార్ అయ్యే ఛాన్సులు కలవు. అప్పుడే ఈమె మీద ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. యూట్యూబర్ అనిల్ తో ఈమె సన్నిహితంగా ఉంటుండగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి.