News

నటి సూర్యకాంతం భర్త ఎవరో..? ఏం చేసేవారు తెలుసా..?

సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది. అయితే సూర్యకాంతం గారు ఒకానొక దశలో అగ్ర నటీనటులకు దీటుగా అధిక సినిమాల్లో నటించేదని ఆమె కాల్ సీట్ల కోసం డైరెక్టర్లు నిర్మాతలు సైతం వేచి ఉండేవారని అలనాటి చిత్ర ప్రముఖులు చెబుతుంటారు.

వెండితెరపై ఎంతో హుందాగా కనిపించే సూర్యకాంతం పుట్టిన ఊరు కాకినాడ కాగా కాగా అప్పటి మద్రాస్ హైకోర్టు జడ్జిని వివాహం చేసుకొని కొన్ని రోజులు చెన్నై నగరంలో ఉన్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఆమె చివరి శ్వాస వరకు ఇక్కడే ఉన్నారు. సూర్యకాంతం 1924 సంవత్సరంలో తన కెరీర్ మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాల పాటు తన సినీ ప్రస్థానంలో ఎన్నడూ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

తాను సంపాదించిందంతా ప్రజా శ్రేయస్సు ఉపయోగించి తాను పుట్టి పెరిగిన కాకినాడ విజయవాడ విశాఖపట్నం చెన్నై హైదరాబాద్ నగరాల్లో ఇప్పటికీ సూర్యకాంతం నిర్మించిన సత్రాలు పాఠశాలలు ఎంతోమందిని ఆదరించి సేవలను అందిస్తున్నాయి. నలుగురి మంచి కోరిన సూర్యకాంతం జీవితకాలం పాటు ఎన్నో దానధర్మాలు చేసి ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తిగా గుర్తింపు పొందింది.

సూర్యకాంతం వెండితెరపై గయ్యాళి అత్తగా కనిపించినప్పటికీ చెన్నై నగరంలో భర్తలు చనిపోయిన చాలామంది స్త్రీలకు ఓకే వేదికపై పునర్వివాహాలు చేసి గొప్ప సంఘసంస్కర్తగా కీర్తించబడ్డారు. సూర్యకాంతం భర్త మద్రాస్ హైకోర్టు జడ్జి అయినప్పటికీ ఆమె కోసం స్టూడియోల ముందు వేచి ఉండేవారు అంటే ఆమె గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యకాంతం తన చివరి శ్వాస వరకు ఎంతో ఉన్నతంగా బతికి నలుగురిని బతికించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker