Sweet Potato: ఈ దుంపలను తరచూ తింటే చాలు, మీ శరీరంలో ఉన్న విషపదార్థాలు బయటకు వస్తుంది.

Sweet Potato: ఈ దుంపలను తరచూ తింటే చాలు, మీ శరీరంలో ఉన్న విషపదార్థాలు బయటకు వస్తుంది.
Sweet Potato: చిలగడదుంపలతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చిలగడదుంపలు ఎంతో ఉపయోగపడుతాయి. చిలగడదుంపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు. ఏదైనా కొత్త ఆహారాన్ని ప్రయత్నించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం. అయితే శక్తిని ఇస్తుంది.. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

వ్యాయామం చేసే వారి కోసం ఇది మంచి ఆహారం. జీర్ణవ్యవస్థకు మేలు.. చిలకడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. మధుమేహ నియంత్రణలో సహకారం: చిలకడదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది.
Also Read: వాల్‌నట్స్ రోజు రెండు తింటే చాలు.
విషపదార్థాల నివారణ.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌కి విరుద్ధంగా పనిచేసి క్యాన్సర్ వంటి జబ్బులను నిరోధిస్తాడు. మెరుగైన కళ్ల ఆరోగ్యం.. చిలకడదుంపలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ Aగా మారి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటు నివారణ.. ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Also Read: ఈ మాత్రలు వాడుతున్నారా..?
చర్మం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పాటు.. విటమిన్ C, విటమిన్ E వంటి విటమిన్లు చర్మం మెరుస్తూ ఉండేందుకు, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. చిలకడదుంపలను మితంగా తీసుకోవడం ఉత్తమం. వాటిని ఆయిల్‌లో వేపితే పోషక విలువలు తగ్గిపోవచ్చు, కాబట్టి ఉడికించి లేదా స్టీమ్ చేసి తినడం మంచిది.