తలస్నానం చేశాక ఈ తప్పులు చేసారో మీ జుట్టు ఊడిపోతుంది.
తలస్నానం కారణంగా కుదుళ్లు బలహీనంగా మారతాయి. సున్నితంగా రుద్దినా జుట్టు ఊడిపోయే ఆస్కారం ఉంది. ఇక టవల్‌తో మరీ గట్టిగా తుడుచుకుంటున్నామంటే, చాలా నష్టం కలిగిస్తున్నట్లే. దీనికి బదులుగా టవల్‌తో మాడును నెమ్మదిగా నీళ్లు ఇంకిపోయేలా ఒత్తుకోవాలి. అయితే ప్రస్తుత కాలంలో ఆడవాళ్లు, మగవాళ్లంటూ తేడా లేకుండా బిజీ బిజిగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. కొందరైతే తినడానికి కూడా సమయం లేనంతగా గడుపుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం చెడిపోవడంతో పాటుగా మానసిక స్థితి కూడా బాగుండదు.
ముఖ్యంగా ఉదయమే ఉద్యోగాలకు హడావుడిగా వెళ్లేవారి ఆరోగ్యమైతే బాగా చెడిపోతుంది. దీనికి తోడు ఇలాంటి వాళ్లకు తడిజుట్టును ఆరబెట్టుకోవడానికి సమయం కూడా ఉండదు. తడిజుట్టును ఎట్టిపరిస్థితిలో దువ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో కుదుళ్లు సున్నితంగా, బలహీనంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో జుట్టును దువ్వితే వెంట్రుకలు విపరీతంగా ఊడిపోయే ప్రమాదముంది. మరొక ముఖ్యమైన విషయం జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు నిద్రపోకూడదు.
ఎందుకంటే అలా పడుకుంటే వెంట్రుకల చివర్లు చిట్లిపోతాయి. దీనికి తోడు జుట్టు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. జుట్టు తడిగా ఉన్నసమయంలో కుదుళ్లు బలహీనంగా మారుతాయి. అందుకే తడి జుట్టును అల్లడం, దువ్వడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే కుదుళ్లపై ఒత్తిడి పడి వెంట్రుకలు బాగా ఊడిపోతాయి. అందులోనూ జుట్టు తడిగా ఉంటే.. తీరు తీరు స్టైలీస్ జడలను వేయకూడదు.
జుట్టు ఆరాలని హెయిర్ డ్రైయర్ లను ఉపయోగించడం అసలే మంచిది కాదు. దీనివల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. బాగా ఊడిపోతుంది కూడా. అందుకే జుట్టును సహజ పద్దతిలోనే ఆరబెట్టాలి. అయితే తలస్నానం చేసిన తర్వాత టవల్ ను ఎక్కువ సేపు జుట్టుకే ఉంచడం కూడా మంచిది కాదు. దీనివల్ల జుట్టులోని తేమంతా పోతుంది. దీంతో మీ జుట్టు ప్రాణంలేనట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది మీ జుట్టుఊడిపోవడానికి కారణమవుతుంది.