టీ, కాఫీలు తాగిన తర్వాత నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా..?
టీ, కాఫీ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కొకక అలవాటు. కొంతమంది టీ, కాఫీలు అమితంగా తీసుకుంటుంటే..మరి కొంతమంది రోజుకు 1-2 సార్లు మాత్రమే తీసుకుంటారు. ఏదైనా సరే పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకూ టీ , కాఫీ అనేది సర్వ సాధారణమే. అయితే మోతాదుకు మించి టీ, కాఫీలు తాగితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.
ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు. వేడి వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. టీ, కాపీలు తాగిన తర్వాత నీళ్లు తాగితే దంతాల మీదున్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది. చల్లగా, వేడిగా, పులుపుగా, తీపి పదార్థాలు దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దంతాల రంగు మారిపోవడం, పంటి నొప్పులు వంటి సమస్యలు కలుగుతాయి.
టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల అల్సర్ సమస్యలు మొదలవుతాయి. ఎసిడిటీ సమస్య కూడా వేధిస్తుంది. కొందరికి ముక్కు నుంచి రక్తం కారుతుంది. శరీరం చలిని, వేడిని తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. వేసవిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. వేడి వేడి టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో జలుబు తీవ్రతను పెంచుతుంది.
అందుకే వేడి టీ తర్వాత వెంటనే నీరు తాగకూడదు. టీ తాగిన తర్వాత నీటిని తాగడానికి బదులుగా టీ తాగే ముందే నీటిని తాగడం మంచిదంటున్నారు నిపుణులు. టీ చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుంది. టీ తాగే ముందు నీటిని తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. ముందు నీళ్లు తాగి తర్వాత టీని తాగితే అసిడిటీ, క్యాన్సర్, అల్సర్లను తగ్గించవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి.