Health

పంటి నొప్పిని నిమిషాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు.

మనం మార్కెట్లో దొరికే రకరకాల టూత్ పేస్టులు ఎంత వాడిన ఫలితం లేదు అని అనుకుంటాం కానీ అవి వాటి పని చేస్తాయి కానీ మనం ఎక్కువగా తినడం వల్ల సమస్య అనేది ఏర్పడుతుంది. పళ్ళను రెండు లేదా మూడు నిమిషాల కంటే ఎక్కువగా బ్రష్ చేయకూడదు. తినే ఆహార పదార్థాలను కాస్త కంట్రోల్లో ఉంచుకొని, చెరుకు గడలను నమ్మడం ద్వారా అందులో ఉండే పిచ్చి పదార్థంతో పల్లెలో ఉండే ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంటే తొలగిపోతుంది. అయితే దంతాలు మనిషి అందాన్ని ఎక్కువచేసేవి.

ఆహారం బాగా నమిలి తినడానికి ఆయుధం లాంటిది. అయితే ఏది పడితే అది తినడం వల్లనో.. దెబ్బలు తగలడం వల్లనో పళ్లు దెబ్బతింటాయి . దీంతో ఒక్క పన్ను నొప్పి పుట్టినా ఎక్కువగా బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి ఏర్పడుతుంది. కానీ, ఇది ఒక్కసారి మొదలైందంటే.. అంత ఈజీగా తగ్గదు.

ఈ నొప్పి తగ్గాలంటే తప్పకుండా డెంటిస్టును సంప్రదించాల్సిందే. ఒక వేళ మీ వద్ద అంత సమయం లేకున్నా.. తక్షణ ఉపశమనం కావాలన్నా. కొన్ని చిట్కాలు పాటిస్తే నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్​.. భరించలేని పంటినొప్పి తో బాధపడేవారికి వెల్లుల్లికూడా బాగా పనిచేస్తుంది. ఇక ఇందులో శక్తివంతమైన యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు అనేవి ఉంటాయి. మీకు బాగా విపరీతమైన పంటి నొప్పి వచ్చిన వారు వెల్లుల్లిని బాగా దంచి దాన్ని కాస్త ఉప్పు లేదా మిరియాల పొడితో కలిపి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో దాన్ని రాయాలి.

ఇలా చేస్తే కనుక చేస్తే తక్షణమే పంటి నొప్పి నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. చక్కెర తగ్గించండి. పంటినొప్పి సమస్య అనేది బాగా ఉన్నవారు ఎక్కువగా చక్కెర ఉన్న పదార్థాలను తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఒక ఐస్‌ ముక్కని తీసుకోని ఓ క్లాత్‌లో పెట్టుకోని వాటిని నొప్పి ఉన్న ప్రాంతంలో సున్నితంగా రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్తనాళాలు ఇంకా రక్త ప్రసరణ అనేవి మెరుగుపడి నొప్పి ఇంకా మంట అనేది తగ్గిపోతుంది.

వేడినీటిని తీసుకోని అందులో ఓ చిటికెడు ఉప్పుని వేసి ఇక ఆ నీటిని ఒక పది నిమిషాలపాటు బాగా పుకిలించి ఉంచాలి. ఇలా రోజులో మీకు వీలైనన్ని సార్లు చేయడం చాలా మంచిది. దీంతో మీకు ఆ పంటి చుట్టూ వుండే ఇన్ఫెక్షన్‌కు కారణమైన అనేక క్రిములు అనేవి వెంటనే నశించడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైన ఆహార పదార్థం కనుక మీ పళ్ల మధ్యలో ఇరుక్కుపోయినా కాని అది వెంటనే బయటకు వచ్చేస్తుంది. దాంతో మీ పంటి నొప్పి సమస్య అనేది తక్షణమే తీరిపోతుంది. ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు పంటి నొప్పి కనుక వేధిస్తే.. వెంటనే వైద్యులను కలిసి మీరు చికిత్స తీసుకుంటే బెటర్​.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker