Health

ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్, ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

తమ అభిమాన హీరోయిన్ పేరుతో ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయడమే కాదు వాళ్ల ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ అమ్మడి చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? శ్వేతా బసు ప్రసాద్ జంషెడ్పూర్ జార్ఖండ్లో 11 జనవరి, 1991 న జన్మించారు.

తరువాత ఆమె చిన్నప్పుడే కుటుంబంతో బొంబాయి వలస వెళ్ళింది. ఆమె తండ్రి అనుజ్ ప్రసాద్ బీహార్ కు చెందినవారు కాగా, తల్లి శర్మిష్ట బసు ప్రసాద్ పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. శ్వేతా తాతయ్య న్యూ ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. ఆమె తండ్రి అనుజ్ న్యూ ఢిల్లీలో శ్రీరామ్ సెంటర్ నుండి డైరెక్షన్, యాక్టింగ్ డిప్లొమా పట్టా పొందారు. వారు తరువాత జంషెడ్పూర్లో స్థిరపడ్డారు.

అక్కడ అతను 1990 లో 1 సంవత్సరం ప్రార్థన తరువాత శ్వేతా తల్లి, సంగీతకారుడు, రచయిత సర్మిస్థాను వివాహం చేసుకున్నాడు, మరుసటి సంవత్సరం వారికి శ్వేత ఉన్నారు. ఫోటోలు ఉన్న బుజ్జాయి మారెవరో కాదు.. అందాల భామ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్వేతా బసు ప్రసాద్. మొదటి సినిమాతోనే నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

తెలుగు కొన్ని సినిమాల్లో నటించిన శ్వేతా బసు ప్రసాద్ ఆ తర్వాత హిందీ లో సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు హార్మోని వాయిస్తున్న చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది వెబ్ సిరీస్లు, కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker