వీటిని తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వయసుతో వచ్చే సమస్యలకు కూడా..!
ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఒకటి ఆప్రికాట్. దీనిని సీమ బాదం అని కూడా అంటారు. ఇది తీపి, వగరు టెస్టులతో భిన్నంగా ఉంటుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అత్యధికంగా ఇస్తుంది. అయితే ఈ పండ్లు రుచికి తీపి వగరు కలయికతో తినడానికి రుచిగా అనిపిస్తుంది. సీజనల్గా దొరికే ఈ పండ్లలో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ మినరల్స్ ఫైబర్ క్యాల్షియం ఐరన్ సోడియం వంటి సహజ మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి.
ఈ పండ్లను సీజన్లో తరచూ మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. శీతాకాలంలో ఎక్కువమందిని బాధించే జలుబు, ఉబ్బసం, గొంతు నొప్పి ఫ్లూ లక్షణాలను అదుపు చేయడంలో ఆఫ్రికాట్ పండు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండ్లలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ శ్వాస వ్యవస్థను బలోపేతం చేసి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఆప్రికాట్ పండ్లు తరచూ తినడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ఫ్యటీ లివర్ వ్యాధి నుంచి మనల్ని రక్షిస్తుంది.
ఆఫ్రికాట్ పండ్లలో కంటిచూపును కాపాడే కెరోటినాయిడ్లు, శాంతోఫిల్స్ అధిక మొత్తంలో ఉండడం వల్ల కంటి సమస్యలను తొలగించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆఫ్రికాట్ పండ్లలో పుష్కలంగా పుష్కలంగా విటమిన్, సి ,విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి ఇవి చర్మ సమస్యలను, కంటి సమస్యలను తగ్గించడంతోపాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.బీటా-క్రిప్టోక్సంతిన్ అనే రసాయనం సీమ బాదం పండ్లలో అధికంగా ఉండడంవల్ల ఆస్టియో ఆర్థరైటిస్,ఆర్థరైటిస్, రుమటాయిడ్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
తరచూ నీరసం, వంటి నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఆఫ్రికాట్ పనులను ఆహారంగా తీసుకుంటే వీటిలో అధికంగా ఉన్న ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దాంతో అలసట నీరసం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ పండ్లలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కూడా నిక్షేపంగా తినొచ్చు.