Health

ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు. తీసుకుంటే ఎంత ప్రమాదమంటే..?

మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాలకు అనుగుణంగా ఆహారానికి లక్షణాలు ఉంటాయని.. అందువల్ల కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోవద్దని అంటున్నారు. ఒకవేళ అలా తీసుకుంటే.. శరీరంలో పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. అయితే కొన్ని ఆహార కాంబినేష‌న్ల వంట‌కాలు భ‌లే టేస్టీగా మ‌రియు ఆరోగ్యంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. చాలా మంది ఆ కాండినేష‌న్లు లేక‌పోతే తిన‌డానికే ఇష్ట‌ప‌డ‌రు.

అయితే, కొన్ని కాంబినేష‌న్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా క్రమేనా విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. నిమ్మకాయ, పాలు క‌లిపి ఎప్పుడూ తీసుకోకూడ‌వు. కడుపులో ఉండే జీర్ణ రసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ క‌డుపులో విషంగా మారే ప్రమాదం ఉంది. పెరుగు, పండ్లు క‌లిపి తీసుకోకూడ‌దు.

సిట్ర‌స్ పండ్లు పెరుగుతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతుంది. మ‌జ్జిగ‌-అర‌టిపండు, న‌ల్ల మిరియాలు-చేప‌లు, పెరుగు-ఖ‌ర్జూరాలు, పాలు-మ‌ద్యం ఇలాంటి కాంబినేష‌న్‌ల‌లో ఫుడ్ తిన‌డం అంత మంచిది కాదు. అర‌టిపండు, పాలు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియపై చెడుప్రభావం చూపుతుంది. అలాగే అరటిపండుని పాలతో తీసుకుంటే జఠరాగ్ని తగ్గిపోతుందని, విషాలు ఉత్పత్తి అవుతాయని,

దగ్గు, జలుబు, అలర్జీలు, సైనస్‌ సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. టీ, పెరుగు ఒకేసారి తీసుకోకూడ‌దు. ఈ రెండిట్లోను యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యత కోల్పోతుంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతోంది. కీర‌దోస‌, ట‌మాటాలు, పెరుగు, వంటి వాటితో నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి తీసుకోకూడ‌దు. లేదంటే క‌డుపులో అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker